డైరెక్టర్ చేతిలో ఏమీ ఉండదట!

0

ఆయన టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరో. కాస్త గ్యాప్ తర్వాత ఈమధ్య వరసబెట్టి సినిమాల చేసేందుకు రెడీ అయ్యారు. ప్రకటనలు జోరుగా వస్తున్నాయి. ఈ స్టార్ హీరోతో ప్రాజెక్టు లైన్ లో ఉన్న ఒక డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తెగ పోజు కొడుతున్నాడట. ఆయన ఒక స్టార్ డైరెక్టర్ అన్నట్టు ఫీల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడట. అయితే అసలు విషయం ఏంటంటే ఈయన చేతిలో సినిమా కంట్రోల్ ఏమాత్రం ఉండదని.. ఆఖరికి యాక్షన్ కట్ లు కూడా హీరోగారే చెప్పుకుని ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఎవరో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేశానని చెప్పుకునే కంటే ఈ స్టార్ హీరోతో చేస్తే ఆ సినిమాకు జరిగే బిజినెస్.. వచ్చే క్రేజ్ ఆకాశంలో ఉంటుంది. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఎవరు ఆ సినిమాను డైరెక్ట్ చేశారు అనేదానితో సంబంధం లేకుండా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. అందుకే ఈ డైరెక్టర్ ప్రస్తుతం తెగ ఉత్సాహంగా ఉన్నాడట. అయితే ఈయన అనుకున్నంత సులువుగా ప్రాజెక్ట్ ఉండదని.. ఏమాత్రం తేడా జరిగినా.. ఎక్కువ తక్కువ మాట్లాడినా హీరోగారు ఈయనకు లెఫ్ట్ రైట్ ఇవ్వడం ఖాయమని కూడా అంటున్నారు.

ఇదంతా ఒక డైరెక్టర్ కు సంబంధించిన గోల. దీన్ని పక్కన పెడితే ఆ స్టార్ హీరో సినిమాల్లో జోరు పెంచడంతో ఇతర స్టార్ హీరోలు కొందరు మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నారట. ఎందుకంటే ఈ స్టార్ హీరో క్రేజ్ అలాంటిది. ఈ హీరోకు హిట్ పడితే దాని రేంజ్ ఎక్కడో ఉంటుంది. ఈయనతో పోటీ పడడం ఇతర హీరోలకు ఆషామాషీ కాదు. అందుకే ఎందుకు వచ్చాడ్రా నాయనా అని తలపట్టుకుంటున్నారట. ఎవడి గోల వాడిది!
Please Read Disclaimer