స్టార్ హీరో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు?

0

ర్యాష్ డ్రైవింగ్.. రేసింగ్ డ్రైవింగ్ ఎంత ప్రమాదమో తెలిసిందే. అలా చేస్తే సెలబ్రిటీలు సంపన్నులు అయినా లెక్క చేయరు పోలీస్. వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేస్తుంటారు. హైదరాబాద్ రోడ్లపై రేసింగ్ డ్రైవర్ల బాధలు పడలేక ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధనను మరింత కఠినతరం చేశారు. తాగి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. లైసెన్స్ కూడా రద్దు చేస్తున్నారు.

ఇటీవలే హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి కోర్టుకు వెళ్లిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ పలువురు సెలబ్రిటీల లైసెన్సులు క్యాన్సిల్ అయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో యాంగ్రీ హీరో రాజశేఖర్ పేరు చేరబోతోందా? అంటే అవుననే సమాచారం లీకైంది.

ఓ.ఆర్.ఆర్.లో యాక్సిడెంట్ తర్వాత సైబరాబాద్ పోలీస్ ఆర్టీఏకు ఓ లేఖ రాశారట. దీంతో ఆర్టీఏ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసేందుకు పరిశీలిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజశేఖర్ పై పలు ర్యాష్ డ్రైవింగ్ ఆరోపణలు చేసిన ట్రాఫిక్ పోలీస్ మొన్న యాక్సిడెంట్ తో విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారట. కొద్దిరోజుల క్రితం హారిబుల్ యాక్సిడెంట్ లో హీరో రాజశేఖర్ ప్రాణాపాయం తప్పి బయటపడిన సంగతి తెలిసిందే. కార్ లో ఎయిర్ బెలూన్స్ సకాలంలో ఓపెన్ అవ్వడం తనని కాపాడింది. ఈ యాక్సిడెంట్ కి తాగి డ్రైవ్ చేయడం ఓ కారణమని మీడియాలోనూ ప్రచారమైంది. ఈవారంలో లైసెన్స్ క్యాన్సిల్ విషయం తేలనుందట.
Please Read Disclaimer