సింగర్ కు రూ. 55 లక్షల గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో

0

కొన్ని నెలల క్రితమే తెలుగు రాష్ట్రంకు చెందిన బేబీ సోషల్ మీడియా ద్వారా సింగర్ గా గుర్తింపు దక్కించుకున్న విషయం తెల్సిందే. కూలి పనికి వెళ్లే బేబీలోని గాన ప్రతిభకు టాలీవుడ్ స్టార్స్ ఎంతో మంది ఫిదా అయ్యారు. ఆమెకు ఏకంగా సినిమాల్లో పాడే ఛాన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా రైల్వే స్టేషన్ లో బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న రాను మొండల్ కూడా స్టార్ సెలబ్రెటీ అయ్యింది. రాను మొండల్ పాడిన పాటను ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయ్యింది. ఆమెకు హిమేష్ రేష్మియా తన సినిమాలో పాడే ఛాన్స్ ఇవ్వడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో.. ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ సందడి చేస్తున్న రాను మొండల్ గురించి పలువురు స్టార్స్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వివరాలను.. ఆమె కుటుంబ విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా సింగర్ రాను మొండల్ గురించి వాకబు చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమెకు ఇల్లు లేదనే విషయం తెలిసిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఆమె ఉండేందుకు 55 లక్షల రూపాయల విలువ చేసే ఒక ఇల్లును ఆమెకు బహుమానంగా ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది.

ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించి ప్రస్తుతం సినిమాల్లో పాటలతో ఫేమస్ అవుతున్న రాను మొండల్ ఈ వయసులో ముందు ముందు మరెన్ని విజయాలను దక్కించుకోబోతుందో చూడాలి. ఇక రాను మొండల్ కు ఒక కూతురు ఉంది. ఆమె తల్లిని చూసుకోవడం ఇష్టం లేక వదిలేసింది. ఇప్పుడు ఆమె తన తల్లి దగ్గరకు వచ్చింది. కూతురుపై ఏమాత్రం కోపం లేకుండా రాను మొండల్ దగ్గరకు తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండియాలో ఇటువంటి ప్రతిభావంతులు ఎంత మంది ఉన్నారు.. ఎందరికో ఛాన్స్ లు లేక వారి ప్రతిభ మరుగున పడిపోతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది ఇలాంటి వారు గుర్తింపు దక్కించుకుని ఓవర్ నైట్ లో సెలబ్రెటీలవుతున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home