శ్రీదేవి భర్తకు మరో ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో

0

ఊర మాస్ యాక్షన్ చిత్రాలను చేసే తమిళ స్టార్ హీరో అజిత్ తన శైలికి పూర్తి భిన్నంగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ ను తమిళంలో ‘నీర్కొండ పార్వె’ గా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఆడవారి తరపున పోరాడే లాయర్ గా అజిత్ కనిపించబోతున్నాడు. ఇమేజ్ భిన్నమైన కథాంశంతో చేసినా కూడా నీర్కొండ పార్వె చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రంను శ్రీదేవి భర్త బోణీ కపూర్ నిర్మించిన విషయం తెల్సిందే. ఆగస్టు మొదటి వారంలో ఈ రీమేక్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీదేవి కోసం అజిత్ చిన్న గెస్ట్ రోల్ ను పోషించాడు. ఆ సమయంలోనే మా బ్యానర్ లో ఒక చిత్రం చేయాలంటూ అజిత్ ను శ్రీదేవి అడిగిందట. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కోరిన కోర్కె తీర్చేందుకు అజిత్ పింక్ రీమేక్ కు ఓకే చెప్పాడు. నీర్కొండ పార్వె చిత్రం విడుదల కాబోతున్న సమయంలో అజిత్ తో మరో సినిమాను బోణీ కపూర్ ప్రకటించాడు. ఈసారి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాన్ని అజిత్ తో బోణీ నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నాడు.

నీర్కొండ పార్వె చిత్ర దర్శకుడు వినోద్ దర్శకత్వంలోనే అజిత్ మరో సినిమా ఉంటుంది. ఈ రీమేక్ కు ముందు అజిత్ తో ఒక మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేయాలని దర్శకుడు వినోద్ ఒక స్క్రిప్ట్ కూడా సిద్దం చేసుకున్నాడట. కాని కొన్ని కారణాల వల్ల పింక్ రీమేక్ చేయాల్సి వచ్చింది. పింక్ రీమేక్ చేస్తున్న సమయంలోనే అజిత్ ను తన స్క్రిప్ట్ తో ఒప్పించాడని.. బోణీ కపూర్ కూడా అజిత్ మూవీని నిర్మించేందుకు ఆసక్తి చూపించాడని అందుకు అజిత్ కూడా ఒప్పుకున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ కొత్త సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకావం ఉంది.
Please Read Disclaimer