స్టార్ హీరోకు మూతి పగిలి 13 కుట్లు పడ్డాయి

0

హీరోలు స్టార్ డంను డబ్బును బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటాం. కాని వారు పడే కష్టాలు వారికి ఉంటాయి. ఒక సినిమాను చేసేందుకు వారు ఎంతగా హోం వర్క్ చేస్తారో చాలా మందికి తెలియదు. ఒక హీరో క్రికెట్ నేపథ్యంలో సినిమా చేయాలంటే మూడు నాలుగు నెలల పాటు క్రికెట్ ఆటను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో అలవాటు లేని పని కనుక కొన్ని సార్లు గాయాలు అవుతుంటాయి. అలాంటి వార్తలు మనం గతంలో చాలానే చూశాం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ మూతి పగిలింది. పాపం ఏకంగా 13 కుట్లు పడ్డట్లుగా సమాచారం అందుతోంది.

షాహిద్ కపూర్ ప్రస్తుతం తెలుగు మూవీ జర్సీ రీమేక్ లో నటిస్తున్నాడు. నాని పోషించిన పాత్రను షాహిద్ కపూర్ పోషిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం నాచురల్ గా రావాలనే ఉద్దేశ్యంతో చాలా రోజులుగా షాహిద్ కపూర్ క్రికెట్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇటీవల మొహాలీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ సీన్స్ జరుగుతున్న సమయంలో బంతి బలంగా వచ్చి మూతికి తలిగిందట. దాంతో పెదవి పలిగి చాలా రక్తం వచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

హిందీ అర్జున్ రెడ్డి తో సూపర్ హిట్ అందుకున్న షాహిద్ కపూర్ మరో తెలుగు మూవీ రీమేక్ తో సక్సెస్ ను కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ రీమేక్ ను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షూటింగ్ లో గాయపడ్డ షాహిద్ కపూర్ ను స్థానిక హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. వెంటనే ముంబయికి షాహిద్ వెళ్లి పోయాడట. వారం నుండి పది రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ షాహిద్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా సినీ వర్గాల వారు చెబుతున్నారు.
Please Read Disclaimer