ఆ స్టార్ హీరో మైనర్ ను పెళ్లి చేసుకున్నారా?

0

తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో అర్జున్. స్టెయిట్ సినిమాల కంటే డబ్బింగ్ చిత్రాల తో సుపరిచితుడైన ఆయన.. ఎన్నో హిట్ చిత్రాల్ని అందించారు. ప్రేక్షకులకు సుపరిచితుడైన అర్జున్.. ఆయన వ్యక్తిగత విషయాలు చాలా తక్కువగానే వినిపిస్తుంటాయి. ఈ సీనియర్ నటుడు 32 ఏళ్ల క్రితం పెళ్లాడారు. అది కూడా లవ్ మ్యారేజే. తాజాగా తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాల్ని తన భార్య నివేదితతో కలిసి ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు. తమది లవ్ మ్యారేజ్ అని చెప్పిన అర్జున్ మాటల్ని చూసినప్పుడు.. ఆయన పెళ్లి చేసుకునే సమయంలో నివేదిక మైనర్ కావటం గమనార్హం. ఇంతకీ అర్జున్ లవ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? పెళ్లి వరకూ ఎలా వచ్చిందన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే..

రూపతార అనే కన్నడ సినిమా మ్యాగజీన్ లో నివేదిత ఫోటోను తొలిసారి చూశాను. ఆమె కన్నడ నటి. ఫోటో చూడగానే.. ఈ అమ్మాయి బాగుందే అనుకున్నా. డాక్టర్ గారి అబ్బాయి అన్న తెలుగు సినమాకు ఓకే చెప్పినప్పుడు.. ఆ సినిమాకు నివేదితను రికమెంట్ చేశారు. ఓకే చెప్పాను. నివేదిత తండ్రి రాజేశ్ అప్పటికే కన్నడలో పెద్ద స్టార్. ఆ టైంలో మా నాన్న శక్తి ప్రసాద్ విలన్ గా మంచి పేరుంది. వారిద్దరూ మంచి స్నేహితులు. డాక్టర్ గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడే నాకు.. నివేదితకుమధ్య సాన్నిహిత్యం పెరిగింది.

ఆ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు సిరింజి చేతికి గుచ్చుకొని చేయి మొత్తం చీలిపోయింది. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కుట్లు వేశారు. ఆ టైంలో ఈ అమ్మాయి పక్కన ఉంది. కళ్లల్లో కన్నీరు కనిపించింది. ఆ రోజు నుంచే ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా సెట్లోనే పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే తనకు ఓకే అంది. పెళ్లప్పుడు నాకుపాతికేళ్లు అయితే.. తనకు పదిహేడేళ్లు. తనకు అప్పట్లో మెచ్యురిటీ తక్కువగా ఉండేది. సినిమా ప్రివ్యూలకు వెళితే.. సడన్ గా ఏడుపు వినిపించేది. ఏడుస్తున్నది ఎవరని చూస్తే.. తనే. ఎందుకని అడిగితే చెప్పేది కాదు. ఇంటికి వచ్చి అడిగితే.. ఆ సినిమాలో హీరోయిన్ తో క్లోజ్ గా మూవ్ కావటాన్ని తట్టుకోలేకపోయేది. నువ్వు యాక్టర్ వే కదా? అంటే.. యాక్షన్ లో భాగంగానే అన్నా.. ఊరుకునేది కాదు. తర్వాత నెమ్మదిగా అర్థం చేసుకుందంటూ తన పెళ్లి నాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు అర్జున్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసినప్పుడు చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకోవటమే కాదు.. మైనర్ ను చేసుకున్నట్లుగా చెప్పక తప్పదు.
Please Read Disclaimer