వైరల్ అవుతున్న స్టార్ హీరో వీడియో సందేశం!

0

హీరో విశాల్.. అంటే తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. ఇటీవల విశాల్ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. అయితే వాళ్ళింట్లో ఫస్ట్ విశాల్ తండ్రి జీకే రెడ్డి మహమ్మారి బారిన పడ్డట్లు తెలిపాడు. తండ్రికి హాస్పిటల్లో సాయం చేసే క్రమంలో విశాల్ కూడా కరోనా బారిన పడ్డాడు. అయితే తాజాగా విశాల్ కరోనా నుండి కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు స్వయంగా తెలిపాడు. విశాల్ ఈ విషయాన్నీ ట్విటర్ వీడియో ద్వారా తెలిపాడు. ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ధైర్యంగా ఉండేలా వీడియోలో మాట్లాడాడు. ఇప్పటివరకు చాలా పర్సనల్ విషయాలు సినిమాల విషయాలు ట్వీట్ చేశా.. కానీ ఇప్పుడు జీవితంలో ఎదుర్కొన్న ముఖ్య సందర్భాలను ఈ వీడియోలో పంచుకుంటున్నట్లు తెలిపాడు.

ఈ వీడియోలో కరోనా పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని.. ఒకవేళ టెస్టులు చేసిన తర్వాత కూడా ఫలితాల కోసం టెన్షన్ పడొద్దని చెప్తున్నాడు. అయితే తన తండ్రి జీకే రెడ్డి గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. అలాగే బాడీ టెంపరేచర్ కూడా 100-103కి పైగా ఉందని అన్నాడు. ఆ తర్వాత రోజు దగ్గు జలుబు వచ్చిందని.. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలున్నాయని తెలిపాడు. ఇక తను ఆయుర్వేద మెడిసిన వాడటం వల్ల కేవలం వారం రోజుల్లో కరోనా బారినుండి బయట పడ్డట్లు తెలిపాడు. వైద్యులు చెప్పినట్లుగా క్రమంగా మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో శరీర ఉష్ణోగ్రత లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు చెప్పుకొచ్చాడు. అంతేగాక సెల్ఫ్ క్వారంటైన్లో ఉండటంతో పాటు మందులు కూడా వాడటం వల్ల వారం రోజుల్లోనే ఆరోగ్యం నార్మల్ అయిందని చెబుతున్నాడు డిటెక్టీవ్. విశాల్ ఉపయోగిస్తున్న మెడిసిన్ కూడా ట్విటర్లో షేర్ చేసాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విశాల్ డిటెక్టీవ్-2 మూవీలో నటిస్తున్నాడు.Please Read Disclaimer