టాప్ డైరెక్టర్ కి హ్యాండిచ్చిన స్టార్ హీరో

0

స్టార్ హీరో తో మురగదాస్ ఖాయం చేసుకున్న ప్రాజెక్ట్ వాయిదా పడిందా? మురగకు సైడేసి వేరొక దర్శకుడు కర్చీప్ వేసేశాడా? అంటే అవుననే ప్రచారమవుతోంది. ఆ మేరకు కోలీవుడ్ వర్గాల్లో వాడి వేడిగా చర్చ సాగుతోంది. తళా అజిత్ నటించే 61వ చిత్రాన్ని మురగదాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్నాడు. స్టోరీ కూడా లాక్ అయింది. వచ్చే ఏడాది ఆ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. దీంతో తళా అభిమానుల్లో ఆనందానికి అవధుల్లేవ్. ‘ధీనా’ తర్వాత అజిత్ తో మురుగదాస్ ఖాయమవ్వడంతో ఆ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ కాంబో రిటీప్ అవుతుండడంతో ఈ చిత్రంపై కోలీవుడ్ సహా టాలీవుడ్ లోనూ ఆసక్తి పెరిగింది.

కానీ మధ్య లో మరో డైరెక్టర్ తెలివైన గేమ్ ఆడటంతో మురగదాస్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందన్న వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇంతకీ అసలేం జరిగింది? మురుగ ప్రాజెక్ట్ చేజారడానికి గల కారణాలేమిటి? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. మురుగదాస్ కంటే ముందుగానే గ్యాంబ్లర్ ఫేం వెంకట్ ప్రభు రెండేళ్ల క్రితం అజిత్ కి స్టోరీ చెప్పాడుట. కానీ ఎప్పుడు ప్రారంభించాలి అన్న విషయం గురించి అప్పుడు నిర్ణయించుకోలేదు. దీంతో అజిత్ కూడా లైట్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో మురగదాస్ అజిత్ ని కలిసి స్టోరీ వినిపించి ఒకే చేయించుకున్నాడుట. కానీ ఇటీవలే వెంకట్ ప్రభు అజిత్ ని మరోసారి కలిసి వచ్చే ఏడాది సినిమా మొదలు పెడదామని చెప్పారుట.

ఈ నేపథ్యంలో మురగదాస్ విషయాన్ని అజిత్ వెంటక్ ప్రభు ముందుకు తీసుకెళ్లాడుట. దీంతో వెంకట్ ప్రభు తన సినిమా షూటింగ్ కు అజిత్ డేట్లు కేవలం రెండు నెలలు కేటాయిస్తే పరిపోతుందని తెలివిగా మెలిక వేశారట. దీంతో అజిత్ కూడా ఒకే చెప్పిన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మురుగదాస్ కు అజిత్ కన్వే చేయగా ఆయన కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసారుట. దీంతో అజిత్ -మురగదాస్ కాంబినేషన్ కి తాత్కిలికంగా బ్రేక్ పడిందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వార్తతో మురుగదాస్ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ప్రస్తుతం అజిత్ ఖాకీ దర్శకుడు హెచ్. వినోద్ తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer