స్టార్ హీరోయిన్ చాలా బాధపడుతోంది

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవల ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించింది. ఆ ప్రయాణం ఆమెకు బాధకలిగించిందట. సోషల్ మీడియాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోనాక్షి తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ ను ట్యాగ్ చేసి సోనాక్షి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఆమె ట్వీట్ కు ఇండిగో కూడా స్పందించి క్షమాపణ చెప్పింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇండిగో ఎయిర్ లైన్స్ లో ప్రయాణించిన సోనాక్షి సిన్హా లగేజ్ ను ఆ ఎయిర్ లైన్స్ సిబ్బంది చాలా కేర్ లెస్ గా పడేశారట. దాంతో ఆమె పెద్ద లగేజ్ సూట్ కేస్ పగిలి పోయింది. ఓపెన్ అయితే కాలేదు కాని పగిలి పోయినట్లుగా ఆమె సన్నిహితులతో చెప్పిందట. తన సూట్ కేస్ పగిలి పోవడంపై ట్విట్టర్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను మెన్షన్ చేస్తూ యూ బ్రోక్ ది అన్ బ్రేకబుల్ అంటూ ట్వీట్ చేసింది.

సోనాక్షి ట్వీట్ కు వెంటనే ఇండిగో స్పందించింది. మీకు కలిగిన అసౌకర్యంకు చింతిస్తున్నాం. మొదట మీకు సారీ చెబుతున్నాము… అందుకు బాధ్యులు అయిన వారితో మాట్లాడుతున్నాము అంటూ రీ ట్వీట్ చేయడం జరిగింది. గతంలో పలువురు సెలబ్రెటీలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కేవలం ఇండిగో ఎయిర్ లైన్స్ లోనే కాకుండా పలు ఎయిర్ లైన్స్ బ్యాగేజీ సిబ్బంది ప్రయాణికుల లగేజీ విషయంలో చాలా బాధ్యతారాహిత్యంగా ఉంటారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికుల బ్యాగేజీల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రయాణికుల బ్యాగేజీల పరిస్థితి ఏంటో..!Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home