తల్లిదండ్రుల విడాకులపై స్టార్ హీరోయిన్ స్పందన

0

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ అనే విషయం తెల్సిందే. మ్యూజిక్ కంపోజర్.. సింగర్.. నటి.. కాస్ట్యూమ్స్ డిజైనర్ ఇలా ఎన్నో రంగాల్లో ప్రావిణ్యం పొందిన శృతి హాసన్ కాస్త గ్యాప్ తర్వాత తెలుగులో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు ఓకే చెప్పింది. పాశ్చాత్య సంస్కృతిని ఎక్కువగా ఫాలో అయ్యే శృతి హాసన్ తన తల్లిదండ్రులు విడిపోయిన విషయాన్ని చాలా లైట్ తీసుకుంటుంది.

గతంలో పలు సందర్బాల్లో తల్లిదండ్రుల విడాకులను సమర్ధించిన శృతి హాసన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మరోసారి వారి విడాకుల విషయంలో చాలా పాజిటివ్ గా స్పందించి ఆమె మెచ్యూరిటీని ప్రదర్శించింది. శృతి ఎన్నో విషయాల్లో కూడా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుందనే టాక్ మొదటి నుండి ఉంది. అందుకు అనుగుణంగానే ఆమె తన తల్లిదండ్రుల విడాకుల విషయంలో బాధపడకుండా వారిని బాధ పెట్టకుండా తప్పుపట్టకుండా ఇద్దరితో మంచి రిలేషన్ ను మెయింటెన్ చేస్తూ వస్తోంది.

శృతి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాకు తల్లి దండ్రులు కాకముందే వారు విడి విడిగా వ్యక్తులు. వారిద్దరికి వేరు వేరుగా వ్యక్తిగత అభిరుచులు ఉంటాయి. పిల్లలు పుట్టారు కదా అని వ్యక్తిగత అభిరుచులు చంపేసుకుని కలిసి ఉండాల్సిన అవసరం లేదు. గొడవలు పడుతూ కలిసి ఉండటం కంటే విడిపోయి ఆనందంగా ఉండటం బెటర్. ఆదే వారు చేశారు. భార్య భర్తలు విడిపోవడం అనేది బాధకరమైన విషయమే కాని కలిసి ఉండలేనప్పుడు విడిపోవడం మంచి నిర్ణయం.

పెద్దల కోసం సమాజం కోసం పిల్లల కోసం అంటూ జీవితాంతం జీవితంను నాశనం చేసుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని ఇష్టం లేని సంసారంను విచ్చిన్నం చేసుకోవడంను తాను సమర్ధిస్తానంటూ శృతి హాసన్ పేర్కొంది. తన తల్లి మరియు తండ్రి నిర్ణయాన్ని గౌరవిస్తానని అందుకే వారిద్దరు విడిపోయినప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా వారి నిర్ణయం పట్ల వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది.

శృతి ఈమద్యే ఆమె ప్రియుడితో కూడా విడిపోయింది. పెళ్లి వరకు వచ్చిన బంధంను ఏవో కారణాల వల్ల బ్రేక్ చేసుకున్నారు. ఆ విషయాన్ని ఇద్దరు కూడా క్లారిటీగా ప్రకటించారు. ప్రస్తుతానికి శృతి సింగిల్ గానే ఉంది. మళ్లీ ఆమె రిలేషన్ లో ఏమైనా పడనుందో చూడాలి.
Please Read Disclaimer