స్టార్ హీరోయిన్ కి రీమేక్స్ కలిసి రావట్లేదేందుకో

0

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఏలుతుంది అక్కినేని కోడలు సమాంత. ఓ వైపు పెద్ద సినిమాలు చేస్తూనే మరో వైపు కాన్సెప్ట్ ఒరియేంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సామ్ కొన్ని రీమేక్స్ కూడా తెలుగులో ట్రై చేసింది. కన్నడలో సూపర్ హిట్టయిన ‘యూ టర్న్’ ను తెలుగులో అదే టైటిల్ తో చేసింది. మొదటి రోజు టాక్ బాగున్నా సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

ఆ వెంటనే కొరియన్ లో సూపర్ హిట్టయిన సినిమాను ‘ఓ బేబీ’ పేరుతో నందిని రెడ్డి డైరెక్షన్ లో చేసింది. సినిమాలో బేబీ పాత్రకు గానూ సమంతకు మంచి మార్కులే పడ్డాయి. సినిమా కూడా సూపర్ టాక్ తో ఓ మూడు రోజులు బాగానే వసూళ్లు సాదించింది. కానీ నాలుగో రోజుకే డ్రాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ పికప్ అవ్వలేదు. దాంతో వచ్చిన దాంతోనే సరిపెట్టుకున్నారు.

ఇక ముచ్చటగా మూడో సారి తమిళ్ లో హిట్టైన ’96’ సినిమాను రీమేక్ చేసింది. ఇందులో కూడా సామ్ కి నటిగా పేరొచ్చింది. కొంత మంది త్రిష అంత కాదు కానీ బాగానే ట్రై చేసిందని చెప్పుకున్నారు. ఇక రివ్యూలు కూడా పాజిటీవ్ గానే వచ్చాయి. వచ్చిన రేటింగ్ కి అప్రిసియేషణ్ ని కలెక్షన్స్ కి మాత్రం పొంతన లేకుండా పోయింది. ఓవర్సీస్ లో బాగానే వసూళ్లు చేస్తుందేమో అని ఊహించిన రాజు గారి అంచనాలు కూడా తారుమారు చేసింది ‘జాను’. ఇలా సామ్ చేసిన మూడు రీమేక్స్ అమ్మడికి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలుగా మాత్రమే మిగిలాయే తప్ప కాసులు కురిపించి భారీ హిట్స్ సాధించలేకపోయాయి.
Please Read Disclaimer