డైరెక్టర్ ను సరిగా పని చేసుకోనివ్వని స్టార్ ప్రొడ్యూసర్

0

ఆయన ఒక పెద్ద నిర్మాత. మొదట్లో ఈ నిర్మాత గారి జడ్జిమెంట్ బాగానే ఉండేది కానీ ఈమధ్య మాత్రం అది పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు. ఈయన సూపర్ హిట్ అవుతుంది అనిచెప్పిన సినిమాలు కాస్తా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి. సినిమాల విషయంలో ఈయన జోక్యం ఎక్కువ కావడం దీనికి ఒక కారణం అని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ నిర్మాత ప్రస్తుతం తను నిర్మిస్తున్న సినిమా విషయం లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు. షూటింగ్ తర్వాత ఎడిట్ టేబుల్ మీద చూడడం.. రీ షూట్లు చెప్పడం కామన్ గా మారిందట. అయితే ఒక ప్రముఖ కమెడియన్ డేట్స్ దొరకకపోవడంతో ఆయన సీన్లు మాత్రం రీ షూట్ చేయకుండా అలాగే ఉంచమని చెప్తున్నాడట. సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ అయిన సినిమాను కామెడీ థ్రిల్లర్ గా మార్చమని దర్శకుడికి ఉచిత సలహాలు చిరాకు తెప్పిస్తున్నాడని యూనిట్ మెంబర్స్ అంటున్నారు. ఈ సినిమా డైరెక్టర్ గతం లో మంచి సినిమాలే తీసిన వ్యక్తి కాబట్టి ఆయన మానాన ఆయనను పని చేసుకోనిస్తే చాలు.. మంచి అవుట్ పుట్ వస్తుందని.. ఇలా కెలికితేనే సినిమా అటూ ఇటూ కాకుండా ప్రేక్షకులు భరించలేని కళాఖండంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు.

అయితే ఇంత కెలుకుతున్నపటికీ ఈ నిర్మాత గారు ఒక విషయం లో మంచి పని చేశారట. అదేంటంటే సినిమా కు మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడం. సమ్మర్ సీజన్లో పెద్ద గా పోటీ లేకుండా చూసుకుని మరీ డేట్ లాక్ చేశారట. ఈ విషయం పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు కానీ దర్శకుడి పనిలో వేళ్లు పెట్టడం మాత్రం ఎవరికీ నచ్చడం లేదట. సీనియర్ అయ్యారు కదా.. చాదస్తం వచ్చిందని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer