ఆ డైరెక్టర్ అంటే భయపడుతున్న స్టార్ హీరోలు!

0

ఆయన ఓ మీడియం రేంజ్ డైరెక్టర్.. అయితే తొలిసారిగా స్టార్ హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో తన టాలెంట్ అంతా ఉపయోగించి సూపర్ హిట్ సాధించే ప్రయత్నాలు చేశాడు. తీసిన సినిమా గొప్పదేమీ కాదు కానీ పరిస్థితులు అన్నీ అనుకూలించడంతో ఆ సినిమా బాక్స్ ఆఫీసు టెస్టులో పాస్ అయింది. అయితే ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ల లీగ్ కు చేరతానని వేసుకున్న అంచనాలు మాత్రం ఇప్పట్లో తీరేలా లేవని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా విడుదలకు ముందు చేసిన హడావుడి.. సినిమాకు తీసుకొచ్చిన హైప్ చూసి కొందరు స్టార్ హీరోలు సదరు దర్శకుడి తో పని చేసేందుకు ఆసక్తి చూపించారట. ఈ సినిమాను చక్కగా హ్యాండిల్ చేసి ఉంటే మాత్రం ఒక స్టార్ హీరో తప్పని సరిగా డేట్స్ ఇచ్చి ఉండేవాడని కూడా అంటున్నారు. అయితే ఈ సినిమాను చూసిన తర్వాత లేనిపోని రిస్కులు ఎందుకని ఆయన మెదలకుండా కూర్చున్నాడట. అంతే కాదు.. ఈ డైరెక్టర్ పనితీరును గమనించిన ఓ సీనియర్ స్టార్ తన కుమారుడికి ఈ డైరెక్టర్ పేరును సూచించారట. అయితే ఆ సన్ గతంలో ఈ మాసు సమ్మెట దెబ్బలు గట్టిగా తిని ఉండడంతో ఈ డైరెక్టర్ తో వద్దంటే వద్దు అని తండ్రితో కరాఖండిగా చెప్పేశాడట. మాసు సినిమాలు చేసినా అందులో కంటెంట్ ఉండాలని తండ్రికి చెప్పడంతో ఆయన కూడా లాజిక్ అర్థమై ఊరుకున్నారట.

ఇవన్నీ చూస్తుంటే స్టార్ హీరోతో పాసు మార్కుల సినిమాను తీసినప్పటికీ ఆ డైరెక్టర్ ను చూసి ఇతర స్టార్ హీరోల భయపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఫార్మాట్ సినిమాలు ప్రతిసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పాసు మార్కులు తెచ్చుకోలేవని.. దెబ్బ తగిలితే డిస్ట్రిబ్యూటర్లు.. నిర్మాతలు గంపగుత్తగా సన్యాసం తీసుకోవాల్సి ఉంటుంది.. ప్రేక్షకులకు హీరోలు సారీ కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుందని గుసగుసలాడుకుంటున్నారు.
Please Read Disclaimer