ప్రేమలో ఓలలాడుతున్న స్టార్ కిడ్

0

మన టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ ను తలదన్నేలా ఉన్నాయని.. వారిని బెదరగొడుతున్నాయని.. ఇలా సవాలక్ష అనుకుంటూ ఊరికే సంతోషపడుతుంటారు చాలామంది. మన తెలుగు సినిమా స్థాయి పెరిగిన సంగతి వాస్తవమే కానీ ఫాస్ట్ కల్చర్ విషయంలో పోలిస్తే.. బాలీవుడ్ ఫాస్ట్ కల్చర్ లో 10 శాతం కూడా టాలీవుడ్ లో ఉండదు. మన హీరోలు ఎంతమందికి లవ్ ఎఫైర్లు ఉన్నాయి.. ఎన్ని సార్లు బ్రేకప్ చెప్పుకుంటారు? ఎంతమంది ఓపెన్ గా ‘నేను గే’ అని ఒప్పుకోగలరు? కంగనా లాంటి ఒక్క సూర్యకాంతం అయినా టాలీవుడ్ లో ఉందా? టాలీవుడ్ లో ఎంతమంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ మనకంటే చాలా ఫాస్ట్ అనే విషయం మనకు అర్థం అవుతుంది.

అంతే కాదు బాలీవుడ్ లో నిన్న ప్రేమించుకుంటూ తిరిగిన జంట ఈ రోజు విడిపోయామని చెప్పి షాక్ ఇవ్వొచ్చు.. రేపు మరో జోడీ వెతుక్కోవచ్చు. అవి కూడా కామన్ విషయాలే. ఇప్పుడు బాలీవుడ్ లో లేటెస్ట్ హాట్ కపుల్ ఎవరంటే కార్తీక్ ఆర్యన్- సారా అలీ ఖాన్. ఇప్పటికే ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారని కొద్దిరోజుల క్రితమే వార్తలు వచ్చాయి. కానీ బాలీవుడ్ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఇద్దరి ప్రేమ చాలా ఘాటుగా మారిపోయిందట. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఎక్కువైందట. ఇద్దరివైపు పేరెంట్స్ నుంచి అంగీకారం రావడంతో ఏమాత్రం అరమరికలు లేకుండా ప్రేమలోకంలో విహరిస్తున్నారట. ఈమధ్యే సారా తన అమ్మగారు అమృతా సింగ్ కు ఈ విషయం చెప్పడంతో ఆవిడ వెంటనే ఒకే అన్నారట. కార్తీక్ ఆర్యన్ ఆవిడకు ముందు నుంచి తెలుసట. కార్తీక్ అంటే ఆవిడకు ఇష్టం కావడంతో సారాకు ఒకే చెప్పేసిందట. అయితే హద్దులు దాటి ప్రవర్తించవద్దని ఆవిడ ఇద్దరికీ సున్నితమైన హెచ్చరిక జారీ చేశారట.

మరోవైపు కార్తీక్ ఆర్యన్ ఇంట్లో కూడా సారా పట్ల సానుకూలంగా ఉన్నారట. అయితే ఇద్దరికీ కెరీర్ లో ఇది తొలి దశ కావడంతో ఇప్పట్లో పెళ్ళి అలోచన మాత్రం లేదట. అంటే ఇప్పటికిప్పుడు చేసుకోరు కానీ ఫ్యూచర్ లో పెళ్ళి చేసుకుంటారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. దీంతో ఇద్దరి బంధం ఫెవికాల్ జోడీలా మారిపోతోందని టాక్. మరి సినిమా పూర్తయిన తర్వాత కూడా ఇలానే ఉంటుందా లేక చెరోదారి చూసుకుంటారా అనేది ఇప్పుడే చెప్పలేం.
Please Read Disclaimer