ఇదేం టైటిల్ పూరి.. ఇదెప్పుడు మేము విన్లే

0

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన సినిమాలను ఎంత విభిన్నంగా తీస్తాడో టైటిల్స్ ను కూడా అంతే విచిత్రంగా విభిన్నంగా పెడతాడు. ఇండియట్.. పోకిరి.. ఇస్మార్ట్ శంకర్ ఇలా ఎన్నో ఆయన కెరీర్ లోని సినిమాలకు వైవిధ్య భరిత టైటిల్స్ ను పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈయన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఇచ్చిన జోష్ తో విజయ్ దేవరకొండ బ్రాండ్ ఇమేజ్ కు సెట్ అయ్యేలా పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రానికి కూడా పూరి వైవిధ్య భరిత టైటిల్ ను పరిశీలిస్తున్నాడట.

నిన్న మొన్నటి వరకు ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘లైగర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. ఈ పదం ఎప్పుడు వినలేదు ఇదెక్కడిది అనుకుంటున్నారా.. దీని అర్థంను గూగుల్ లో వెదికితే సింహానికి ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారని వస్తుంది. అంటే క్రాస్ బ్రీడిరగ్ బిడ్డ అని అర్థం. మరి ఈ టైటిల్ తో పూరి సినిమా చేస్తున్నాడు అంటే వెనుక చాలా పెద్ద కథే ఉండి ఉంటుందని అంటున్నారు.

లైగర్ టైటిల్ సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడం తో నెటిజన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఇదేంది ఇది ఇదెప్పుడు చూడలా ఇదెప్పుడు విన్లే అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు. పూరి అనుకుంటే ఏదైనా పెడతాడు. ఇప్పుడు ఫేమస్ కాకున్నా ఆయన పెడితే అదే ఫేమస్ అవుతుందంటూ టైటిల్ గురించి మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లైగర్ టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.
Please Read Disclaimer