స్ట్రీట్ డ్యాన్సర్ 3డి ట్రైలర్ టాక్

0

డ్యాన్స్ బేస్డ్ సినిమాలంటే స్టెపప్ సిరీస్ ని గుర్తు చేసుకుంటారు. హాలీవుడ్ లో స్టెపప్ సిరీస్ సంచలనాల గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంటుంది. ఆ సినిమాల స్ఫూర్తితోనే బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ కం డైరెక్టర్ రెమో.డి.సౌజా ఏబీసీడీ సిరీస్ సినిమాల్ని తెరకెక్కించారు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజై సంచలన విజయాలు సాధించాయి. తాజాగా స్ట్రీట్ డ్యాన్సర్ 3డి చిత్రానికి రెమో డి.సౌజా దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్- శ్రద్ధా కపూర్ – ప్రభుదేవా- నోరా ఫతేహి లాంటి టాప్ రేంజ్ డ్యాన్సర్లతో 3డిలో చేస్తున్న టెక్నికల్ వండర్ ఈ సినిమా అన్న చర్చా వేడెక్కిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా టీజర్.. పోస్టర్లు డ్యాన్స్ ప్రియుల్లో వేడి పెంచాయి. హాలీవుడ్ స్టెపప్ సిరీస్ కి ఏమాత్రం తగ్గని ట్రీట్ ఉంటుందన్న సిగ్నల్స్ అందాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ ఈ అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది. ట్రైలర్ ఆద్యంతం మెరుపు తీగలు నాట్యమాడాయా? అన్నంతగా చెలరేగి నృత్యం చేస్తున్న డ్యాన్సర్లతో మోతెక్కిపోయిందనే చెప్పాలి. స్టేజ్ షోలు.. రియాలిటీ షోల్లోనే కొరియోగ్రాఫర్లు బోలెడంత క్రియేటివిటీ చూపిస్తున్నారు. అందుకు ధీటుగా ఇప్పుడు వెండితెరపైనా ఛాలెంజ్ ని స్వీకరించారనే తాజా ట్రైలర్ చెబుతోంది.

ఇక క్రికెట్ తరహాలోనే ఇండియా- పాక్ వార్ ని ఈ డ్యాన్సింగ్ మూవీకి ఆపాదించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పాక్ తో టీమిండియా వార్ తరహాలో డ్యాన్సుల్ని కొరియోగ్రాఫ్ చేయడం .. ఇరువర్గాల మధ్య ఆ తరహా వైరాన్ని చూపిస్తూ డ్యాన్సుల్లో వేడి పెంచడం వగైరా స్టింట్ మైమరిపిస్తోంది. ఇక శ్రద్ధా కపూర్ నెవ్వర్ బిఫోర్ అన్నంత సెక్సీ లుక్ తో వేడెక్కిస్తోంది. యంగ్ హీరో వరుణ్ ధావన్ మరో సల్మాన్ ని తలపించేలా కండలు పెంచి పర్ఫెక్ట్ బాడీని ఎలివేట్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ పోరుకు సిద్ధమయ్యే పాకిస్తానీ డ్యాన్సర్ గా శ్రద్ధా నటిస్తుంది. భారత్ తరపు నుంచి వరుణ్ ధావన్ తో శ్రద్ధా వార్ ని తెరపై చూపిస్తూ ఆ ఇద్దరి మధ్యా ఫైట్ ని రక్తి కట్టిస్తున్నారు. ఇంతవరకూ భారతదేశంలో తెరకెక్కిన ఏ డ్యాన్స్ బేస్డ్ చిత్రంలోనూ ఇండియా- పాక్ గొడవల్ని చూపించిందేమీ లేదు. తొలిసారి ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారు.

`ఎబిసిడి 2` చిత్రంలో వరుణ్ -శ్రద్ధా జోడీ ఇద్దరూ బెస్ట్ డ్యాన్సింగ్ స్కిల్ తో మైమరిపించారు. ఈసారి ఆ ఇద్దరూ డ్యాన్సుల్ని మరో స్థాయికి తీసుకెళుతున్నారనే అర్థమవుతోంది. కొరియోగ్రాఫర్ కం దర్శకుడు ప్రభుదేవా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ ఐటమ్ క్వీన్.. బాహుబలి మనోహరి నోరా ఫతేహి హీటెక్కించే స్టెప్పులు గగుర్పొడిచే విన్యాసాలతో కట్టిపడేయనుందని ట్రైలర్ చెబుతోంది.
Please Read Disclaimer