మన ఫ్లాప్ డైరెక్టర్ కు అక్కడ బంపర్ ఆఫర్

0

అందాల రాక్షసి.. కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్న దర్శకుడు హను రాఘవపూడి ఆ తర్వాత చేసిన లై మరియు పడి పడి లేచే మనసు చిత్రాలు తీవ్రంగా నిరాశ పర్చాయి. ఆ సినిమా ఫలితాల నేపథ్యంలో తెలుగులో ఏ హీరో కూడా ఈయనతో వర్క్ చేసేందుకు సాహసించడం లేదు. భారీ బడ్జెట్ తో పాటు విభిన్నమైన కాన్సెప్ట్ లతో ఈయన రెడీ చేసిన స్క్రిప్ట్ లు విన్న హీరోలు కొందరు తమ వల్ల కాదన్నారట.

పలువురు నిర్మాతలు కూడా ఈయన స్క్రిప్ట్ లు విని బాగానే ఉన్నాయి కాని నీతో ప్రాజెక్ట్ చేయడం ఇప్పుడు మా వల్ల కాదన్నారట. దాంతో టాలీవుడ్ లో కాదని బాలీవుడ్ లో ఈయన ప్రయత్నాలు చేశాడట. తాజాగా బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ తో ఒక ప్రాజెక్ట్ ను ఓకే చేయించుకున్నాడు. భారీ యాక్షన్ డ్రామా సినిమాను అక్కడ చేసేందుకు హను రాఘవపూడి రెడీ అవుతున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ లో ఈ సినిమాను అనూజ్ శర్మ నిర్మించబోతున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు తన సత్తా ఏంటో చూపిస్తానంటూ ఈ ఫ్లాప్ దర్శకుడు చాలా నమ్మకంగా ఉన్నాడు.

నితిన్ తో ఈయన చేసిన ‘లై’ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ పరంగా మంచి మార్కులను దక్కించుకుంది. అందుకే ఈసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు సన్నీ డియోల్ ను ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో కమర్షియల్ డైరెక్టర్ గా సక్సెస్ లు దక్కించుకోలేక పోయిన ఈ దర్శకుడు హిందీలో అయినా ఆ సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-