100కేజీల RDX పేలినట్టుగా

0

ఆర్.ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో పాయల్ అందాల విందు కుర్రకారును కట్టి పడేసింది. ఫలితంగా తొలి ప్రయత్నమే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అందాల ఆరబోతకు అడ్డు చెప్పని హాట్ బాంబర్ గా పాయల్ కుర్రాళ్ల గుండెల్లో ఉండిపోయింది. సరిగ్గా ఈ పాయింట్ నే క్యాష్ చేసుకునేందుకు ప్రస్తుతం మరోసారి అలాంటి ప్రయత్నమే సాగుతోంది.

పాయల్ నటిస్తున్న తాజా చిత్రం `ఆర్.డి.ఎక్స్`. ఈ సినిమా నుంచి ఇప్పటికే పాయల్ స్టిల్స్ రిలీజై అంతకంతకు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో హాట్ బాంబర్ లాంటి ఫోటోని చిత్రబృందం రివీల్ చేసింది. రెడ్ అలెర్ట్ ఆర్.డి.ఎక్స్ బ్లాస్ట్స్ అంటూ త్వరలో టీజర్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో పాయల్ అందచందాలు యువతరంలో చర్చకు వచ్చాయి. కోకా రైకా అందంగా చుట్టేసినా పవిట కొంగు అడ్డు పెట్టడం మర్చిపోయింది. పాలనురుగు నాభి కేంద్రం .. దాని పక్కనే కుంకుడు కాయ పుట్టుమచ్చ గుండెల్లో గుబులు రేపుతోంది. సూదంటు చూపులతో సురసుర చూస్తూనే జడలో మల్లెచెండును చేత్తో పట్టుకుని గిరగిరా తిప్పేస్తోంది. ఫోటోతోనే ఇంత వేడెక్కిస్తే పూర్తి టీజర్ లో ఇంకెంతగా రగిలిస్తుందో. 1000 కేజీల ఆర్డీఎక్స్ పేలినట్టుగా కుర్రకారు గుండెల్లో విధ్వంశం తప్పదేమో!

ఈ చిత్రం లో బోల్డ్ పాత్రలో నటిస్తోంది పాయల్. తన గ్లామర్ తో యూత్ ఫిదా కావడం గ్యారెంటీ. ఈ సినిమా కథ పాయల్ పాత్రా చుట్టూనే తిరుగుతుంది. హుషారు తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో తేజస్ కంచర్ల ఈ చిత్రంలో కథానాయకుడు. శంకర్ భాను దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాయల్ కెరీర్ పరంగా ఫుల్ బిజీ. తెలుగు – తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటుంది. వెంకీ మామా చిత్రంలో వెంకటేశ్ జోడిగా నటిస్తోంది. మాస్ రాజా రవితేజ సరసన డిస్కోరాజా లో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.
Please Read Disclaimer