Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘పలాస 1978’ చిత్ర యూనిట్ కి బన్నీ ప్రసంశలు..!

‘పలాస 1978’ చిత్ర యూనిట్ కి బన్నీ ప్రసంశలు..!


‘పలాస 1978’ సినిమా కరోనా లాక్ డౌన్ కు ముందు చిన్న సినిమాగా విడుదలై మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో రక్షిత్ – నక్షత్ర – రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శ్రీకాకుళం జిల్లాల్లోని పలాసలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. తమ్మారెడ్డి భరద్వాజ్ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు. సమాజంలో కుల వర్ణ వివక్ష గురించి.. సామాజికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో అనేది ఈ చిత్రంలో చూపించారు. ఇక సంగీత దర్శకుడు రఘు కుంచె సమకూర్చిన పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ‘నాది నక్కిలీసు గొలుసు’ ‘బావొచ్చాడో లప్పా బావొచ్చాడో’ అనే పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ‘పలాస 1978’ చిత్రాన్ని ఇటీవల చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడిని పిలిపించుకొని ప్రత్యేక అభినందనలు తెలిపాడు. ‘పలాస’ మూవీ బాగా నచ్చిందని.. నటీనటులను చిత్ర యూనిట్ ను ప్రశంసించాడు.

”పలాస 1978 చిత్ర బృందానికి అభినందనలు. ఈ చిత్రాన్ని చూసిన మరుసటి రోజు ఉదయం డైరెక్టర్ ని కలిశాను. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా నాకు ఈ చిత్రం చాలా నచ్చింది. చాలా మంచి మెసేజ్ ఉంది. న్యూ ఏజ్ తెలుగు చిత్రాలలో ఇంత మంచి దర్శకులు నటులు రావడం చాలా ఆనందంగా ఉంది. పలాస 1978 చిత్ర నటీనటులకు సాంకేతిక నిపుణులకు నిర్మాతలకు మరియు మొత్తం చిత్ర బృందానికి నా హృదయ పూర్యక అభినందనలు” అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దీనికి ‘పలాస’ చిత్ర దర్శకుడు కరుణ కుమార్ తో దిగిన ఫోటోను షేర్ చేశాడు బన్నీ. ‘పలాస 1978’ సినిమా గురించి ఇంతకముందు కూడా సినీ ప్రముఖులు మెచ్చుకుంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.