#సుచీ కుక్స్ .. సుచిత్ర వంటల చిట్కాలు

0

నాలుగేళ్ల క్రితం సుచీలీక్స్ ప్రకంపనాలు ఏ స్థాయిలో కుదిపేసాయో తెలిసిందే. గాయని సుచిత్ర ట్విట్టర్ ఖాతా ద్వారా పలువురు టాప్ స్టార్ల ప్రయివేటు ఫోటోలు- వీడియోలు ఎపిసోడ్ ఎపిసోడ్లుగా అంతర్జాలంలోకి రిలీజయ్యాయి. ఆ క్రమంలోనే అటు తమిళ పరిశ్రమ సహా ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ సుచీలీక్స్ వ్యవహారం వేడెక్కించింది. లీకేజీ వీడియోల్లో పలువురు టాప్ హీరోలు ఉండడంతో అది కాస్తా జాతీయ మీడియాలోనూ వైరల్ అయ్యింది. సుచీలీక్స్ వ్యవహారం వల్లనే సుచిత్ర తన భర్తకు విడాకులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికే తన మానసిక పరిస్థితి బాలేదని భర్త కార్తీక్ మీడియా ముందు స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఆ తర్వాత సుచిత్ర ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే చెన్నయ్ లో తమ నివాసంలో సుచిత్ర కనబడడం లేదని సుచీ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి మిస్సింగ్ కేసు మీడియాలో వైరల్ గా చర్చకు వచ్చింది. తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని తన సోదరి మోసపూరితంగా మాట్లాడుతూ వంచిస్తోందని సుచిత్ర మీడియాకు వెల్లడించింది.

అంతేకాదు.. అసలు సుచీలీక్స్ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని తన పేరును వాడుకుని ఎవరో ఈ దురాగతానికి పాల్పడ్డారని సుచిత్ర వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది. ఎవరో ఉద్ధేశపూర్వకంగానే తనని వంచించారని.. సుచీలీక్స్ లో స్టార్ల ఫోటోలు వీడియోలు లీకవ్వడానికి తాను కారణం కాదని సుచిత్ర ఖండించడం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇక సుచీలీక్స్ లో అమలాపాల్ – ధనుష్- అనిరుధ్ వంటి స్టార్ల పేర్లు ఎక్కువగా వైరల్ అయ్యాయి. కథానాయిక సంచిత పదుకొనే న్యూడ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే సదరు స్టార్ల వీడియోలు ఫోటోలు లీక్ అవ్వడానికి తాను కారణం కాదని సుచిత్ర వెల్లడించింది. అసలు తనకు ఆ వీడియోల గురించే తెలియదని ఓ మీడియా సమావేశంలో సుచీ అనడం హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు అప్పట్లో సుచీ మిస్సవ్వడానికి కారణమేంటి? అంటే.. ఆ గొడవ తనపై తీవ్ర ప్రభావం చూపించిందని.. పైగా భర్త కార్తీక్ కి విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని.. దాంతో ఒత్తిడికి గురై బ్రిటన్ వెళ్లిపోయానని సుచీ తెలిపింది. “అక్కడ ఫ్రెంచి వంటకాలు వండే కోర్సులో చేరాను. త్వరలోనే ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభిస్తున్నా. సుచీ కుక్స్ అనేది టైటిల్. ఇక్కడ అంతర్జాతీయ వంటకాల్ని ఎలా వండాలో నేర్పిస్తాన. తమిళ భాషలో వంటల చిట్కాలు నేర్పిస్తాను“ అని తెలిపింది. అంతేకాదు మునుపటిలానే చిత్ర పరిశ్రమలో గాయనిగా కొనసాగుతానని సుచిత్ర వెల్లడించింది. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Please Read Disclaimer