సుచీ లీక్స్ సుచిత్ర మళ్లీ మిస్సింగ్!

0

2017 లో సుచీ లీక్స్ ప్రకంపనాల గురించి తెలిసిందే. అప్పట్లో పలువురు తమిళ్-తెలుగు స్టార్లు.. టాప్ సెలబ్రిటీ ల ప్రయివేటు ఫోటోలు వీడియోల్ని సుచీ లీక్స్ పేరు తో లీక్ చేసి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. గాయని సుచిత్ర చేసిన పనికి తన భర్త కార్తీక్ పబ్లిగ్గా క్షమాపణలు కోరాడు. సుచిత్ర తీవ్రమైన మానసిక వ్యథ తో ఇబ్బంది పడుతోంది. అమెరికా లో చికిత్స చేయిస్తున్నాను అని భర్త కార్తీక్ తెలిపాడు. అయితే అప్పటి తో ఆ కథ ముగిసింది అనుకుంటుండగానే.. మరో సారి సుచిత్ర గురించిన మరో వార్త ప్రకంపనాలు రేపుతోంది.

ఇటీవల చెన్నయ్ ఇంటి నుంచి సుచిత్ర మిస్సయ్యింది! అంటూ చెన్నయ్ మీడియా లో హడావుడి మొదలైంది. ఈ మిస్సింగ్ వ్యవహారం పై సుచీ సోదరి చెన్నయ్ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఎట్టకేలకు సుచిత్ర ఎక్కడ ఉందో కనిపెట్టారు. చెన్నయ్ అద్యార్ అనే రద్దీ ప్రదేశం లో ఓ స్టార్ హోటల్లో సుచిత్ర పట్టుబడింది. అయితే పోలీసుల కు చిక్కిన తర్వాత సుచీ మీడియా కు చెప్పిన చాలా సంగతులు నిశ్చేష్టుల్ని చేస్తున్నాయి. బావతో కలిసి తన సోదరి తనని బంధించిందని.. ఆ ఇద్దరూ తన పై కుట్రల కు పాల్పి చట్ట విరుద్ధమైన చర్యల కు పూనుకున్నారని తెలిపింది.

“నాపై సీక్రెట్ ప్లాన్స్ వేసి నన్ను బంధించేశారు!“ అని గాయని సుచిత్ర ఆవేదన చెందింది. కొద్ది రోజుల క్రితమే భర్త నుంచి సుచిత్ర విడాకులు తీసుకుందన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యం లోనే ఈ కొత్త పరిణామాలు తనని మరోసారి మానసికంగా ఇబ్బందుల్లోకి నెట్టేశాయని సన్నిహితులు భావిస్తున్నారు.
Please Read Disclaimer