విడాకులు తీసుకున్న స్టార్ కపుల్ మళ్లీ కోర్టుకు

0

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కపూర్ కొన్నాళ్ల క్రితం సుచిత్ర కృష్ణమూర్తి నుండి విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. వీరిద్దరి మద్య వచ్చిన విభేదాల కారణంగా విడాకులకు వెళ్లారు. విడాకుల సమయంలో వీరికి ఒక పాప ఉంది. విడాకుల పక్రియ సమయంలో ఆ పాపకు శేఖర్ కపూర్ కు చెందిన ఆస్తిలో వాటా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ముంబయిలోని ఒక భవనంను కూతురుకు శేఖర్ కపూర్ ఇచ్చాడు. అయితే ఆ భవనం ప్రస్తుతం కబీర్ బేడీ ఆధీనంలో ఉంది.

తన కూతురుకు ఇచ్చిన భవనంను కబీర్ బేడీ వాడుకుంటున్నాడు అంటూ సుచిత్ర కృష్ణమూర్తి గత కొంత కాలంగా ఆరోపిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఆమె కోర్టు కు కూడా వెళ్లింది. మాజీ భర్త శేఖర్ కపూర్ మరియు కబీర్ బేడీలపై ఆమె ఫిర్యాదు చేసింది. తన కూతురుకు ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్నారని.. తనకు కాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ సుచిత్ర ఆరోపిస్తుంది.

మరో వైపు కబీర్ బేడీ మాత్రం ఈ విషయంలో తన తప్పేమి లేదని.. పూర్తిగా నిబంధనల ప్రకారం తాను ఈ భవనంను లీజ్ కు తీసుకున్నాను. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ నా వద్ద ఉన్నాయని ఈయన అంటున్నాడు. శేఖర్ కపూర్ నుండి ఈయన లీజ్ కు తీసుకున్నట్లుగా చెబుతున్నాడు. అయితే సుచిత్ర మాత్రం తన కూతురుకు ఇచ్చిన ఆస్తిని ఆయన ఎలా లీజ్ కు తీసుకుంటాడు అంటూ ప్రశ్నిస్తుంది. మరి కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-