నైజాంలో ఆయన సహకారం తప్పనిసరి!

0

తెలుగు సినిమాల బిజినెస్ కు కీలకమైన ఏరియా నైజాం. ఈ ఏరియా డిస్ట్రిబ్యూషన్ లో గ్రిప్ ఉంటే మిగతా ఏరియాలపై పట్టు సాధించడం కష్టమైన విషయం ఏమీ కాదని అంటారు. మొదట్లో ఈ ఏరియాలో హీరో నితిన్ నాన్నగారు సుధాకర్ రెడ్డి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవారు. దీంతో థియేటర్ల విషయంలో కూడా ఆయనకు మంచి పట్టు ఉండేది. అయితే తర్వాత కాలంలో దిల్ రాజు ఎంట్రీ ఇవ్వడంతో ఈక్వేషన్స్ మారాయి. రాజుగారు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా మారడమే కాదు థియేటర్ల విషయంలో కూడా పట్టు సాధించారు.

ఇప్పుడు కూడా రాజుగారికి గ్రిప్ ఉంది కానీ మునుపటి స్థాయిలో కాదు. రాజుగారు ఎక్కువగా సినిమా నిర్మాణంపై ఫోకస్ చేయడంతో నైజాం డిస్ట్రిబ్యూషన్లో ఇప్పుడు ఏషియన్ సునీల్ హవా కొనసాగుతోందని టాక్ ఉంది. అంటే నైజాం లో ఒక సినిమాకు ఎక్కువ స్క్రీన్స్.. మంచి థియేటర్లు దక్కాలంటే ఆయన సహకారం తీసుకోవడం తప్పనిసరి. సుధాకర్ రెడ్డి లాంటి సీనియర్ నైజాం డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏషియన్ సునీల్ పై ఆధారపడడం తప్పడం లేదని అంటున్నారు.

అఖరికి తనయుడు నితిన్ సినిమాకు థియేటర్లు కావాలన్నా సుధాకర్ రెడ్డి గారు ఏషియన్ సునీల్ సహకారం తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ఒకప్పుడు ఈ ఏరియాకు లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అయి ఉండి కూడా ఇప్పుడు థియేటర్లకోసం మరో డిస్ట్రిబ్యూటర్ పై ఆధారపడడం పెద్దగా నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోవాల్సి వస్తోందని అంటున్నారు.