సుధీర్ బాబు.. ఇంత టాలెంట్ ఎక్కడ దాచవయ్యా?

0

తెర మీద వీరోచిత పోరాటాల తో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసినా.. దాని వెనుక ఉండే ట్రిక్ అందరికి తెలిసిందే. రీల్ కు భిన్నంగా రియల్ గానే అలాంటి కళను ప్రదర్శిస్తే ఆశ్చర్యంతో అవాక్కు అవ్వాల్సిందే. తాజాగా అలాంటి అనుభూతినే అందిస్తున్నారు హీరో సుధీర్ బాబు. టాలీవుడ్ లోని ఇతర హీరోలకు భిన్నంగా సినిమాల్ని ఎంపిక చేసుకోవటం.. తనదైన జోనర్ ఒకటి సెట్ చేసుకున్న ఆయన.. తన నుంచి సినిమా వస్తుందంటే.. అంతో ఇంతో ఏదో ఒక కొత్తదనం ఉంటుందన్న భావన కలిగించటం లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తాజాగా ఆయన సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోలు అవాక్కు అయ్యేలా ఉన్నాయి. ఎలాంటి మేజిక్ లేకుండా.. మంత్రం వేయకుండానే గాల్లో ఆసనాలు వేసిన వైనం ఇప్పుడు వావ్ అనేలా ఉందని చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోల్ని ఆయన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఇప్పుడున్న సాంకేతిక తో ఏమైనా ఫోటో షాప్ చేశారా? అన్న సందేహం అక్కర్లేదంటున్నారు.

గాల్లో ఎగురుతూ.. యోగాలో తనకున్న ప్రతిభ ను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అలా చేసే క్రమంలో కొన్ని ఫోటోలు తీయించాడు సుధీర్. అలా వచ్చిన ఫోటోల్లో బెస్ట్ అన్న వాటిని సోషల్ మీడియా లో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడని చెప్పాలి. ఈ ఫోటోల కు నెటిజన్లు కాస్త ఫన్నీగా రియాక్ట్ అవుతున్నా.. ఫోటోల్ని చూస్తే మాత్రం సుధీర్ కష్టం కొట్టొచ్చినట్లు గా కనిపించక మానదు. ఈ కాన్సెప్ట్ ను తన తర్వాతి చిత్రం లో చూపిస్తే.. ప్రేక్షకులు థ్రిల్ కు గురి కావటం ఖాయం. మరి.. ట్రై చేస్తారంటారా?
Please Read Disclaimer