హోమ్ జిమ్ లో ఇరగదీస్తున్న హీరో

0

కరోనా దెబ్బకి అన్ని పరిశ్రమలు షట్ డౌన్ అయిపోతున్నాయి. సినీపరిశ్రమలు బంద్ ని ప్రకటించాయి. సినిమాల రిలీజ్ లు.. షూటింగ్ లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తారలు స్వీయనిర్భందం పాటిస్తున్నారు. హీరోహీరోయిన్లు నిత్యం ఫిట్ గా ఉండాలంటే జిమ్- యోగా వంటి వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. లేదంటే లావైపోతారు. బయట జిమ్ లకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కాస్త క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. ఇళ్ళునే జిమ్ గా మార్చుకొంటున్నారు.

మొన్న రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లోనే యోగా- ఎక్సర్ సైజ్ లు చేస్తున్న వీడియోని పంచుకుంది. బాలీవుడ్ నటి జాక్వెలిన్ సైతం హాల్ నే యోగా సెంటర్ గా మార్చేసుకుంది. ఆదాశర్మ సైతం ఇంట్లోనే వ్యాయామం చేస్తోంది. వరుణ్ తేజ్ ఇంటి వద్దే బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇలా ఏ ఒక్కరు ఖాళీగా ఉండటం లేదు. తమ వంతుగా బాడీకి శ్రమనిస్తూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
వాటి జాబితాలో సుధీర్ బాబు కూడా చేరారు. ఆయన ఐదు రోజులుగా ఇంట్లోనే జిమ్ చేస్తున్నాడు. తన ఇంటిలోని వస్తువులను జిమ్ కి చెందిన ఎక్విప్ మెంట్ గా మార్చుకుని వర్కౌట్ చేస్తున్నారు. డోర్- సోఫా- టవల్- బ్యాగ్- ఫ్లోర్ ఇలా దేన్ని వదల్లేదు. ప్రతిదాన్ని ఎలాగోలా వర్కౌట్ కోసం ఉపయోగించుకున్నాడు. అంతేకాదు రెగ్యులర్ గా తాను ఎలాంటి ఎక్సర్ సైజ్ లు చేస్తున్నాడో.. రోజూ ఎంత సేపు చేస్తున్నాడో ఐదు రోజులకు సంబంధించిన ఓ లిస్ట్ ని ప్రిపేర్ చేసి వీడియో పంచుకున్నాడు. ప్రతి దాని గురించి వివరిస్తూ వ్యాయామం చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సుధీర్ `వీ` చిత్రంలో నటిస్తున్నారు. నాని విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన విషయం విదితమే. దీంతోపాటు బాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లోనూ సుధీర్ నటించనున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-