వీడియో : సూపర్ స్టార్ కూతురు న్యూ జర్నీ

0

బాలీవుడ్ లో వారసులకు కొదవ లేదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ కిడ్స్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇక గత కొంత కాలంగా షారుఖ్ ఖాన్ కిడ్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికే షారుఖ్ ఇద్దరు పిల్లలకు కూడా తెగ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షారుఖ్ కూతురు సుహాన ఖాన్ అతి త్వరలోనే వెండి తెరపై మెరబోతుంది. ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న ఈ అమ్మాయి తాజాగా న్యూయార్క్ యూనివర్శిటీలో యాక్టింగ్ కోర్స్ జాయిన్ అయ్యింది.

ప్రపంచ ప్రసిద్ది గాంచిన ఆ యూనివర్శిటీలో తన కూతురు జాయిన్ అయ్యింది అంటూ షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. సుహాన ఖాన్ యూనివర్శిటీలోకి వెళ్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. చాలా మోడ్రన్ లుక్ తో షార్ట్ వేసుకుని వైట్ టీ షర్ట్ తో లూస్ ఎయిర్తో లోనికి సుహాన వెళ్తుంది. వెనుక నుండి గౌరీ ఖాన్ వీడియో తీసింది. యూనివర్శిటీలోకి సుహాన రాయల్ గా ఎంట్రీ ఇస్తున్న తీరు చూస్తుంటే ఆమె భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకునే ఛాయలు కనిపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటికే హీరోయిన్ స్థాయి క్రేజ్ ను దక్కించుకున్న సుహాన ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. అందంతో పాటు యాక్టింగ్ స్కిల్స్ కాస్తంత లక్ ఉంటే బాలీవుడ్ లో స్టార్ గా గుర్తింపు దక్కించుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. అందం ఎలాగూ ఉంది.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన యూనివర్శిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తుంది అలాగే చిన్నప్పటి నుండి నటనకు సంబంధించిన కుటుంబంలో ఉంది కనుక నటనలో నటనలో ఆరితేరడం ఖాయం. ఇక షారుఖ్ కూతురుగా ఆమెకు ఉన్న క్రేజ్ తో లక్ కూడా కలిసి వస్తే భవిష్యత్తులో మంచి స్టార్ అవుతుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
Please Read Disclaimer