మెగాస్టార్ మూవీ పై వస్తున్న వార్తలన్నీ పుకార్లేనా…?

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చిరు మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారు. పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ రీమేక్ కు ‘సాహో’ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే మన నేటివిటీకి తగ్గట్లు తగినన్ని మార్పులు చేశాడట సుజీత్. ఇదిలా ఉండగా ‘లూసిఫర్’ సినిమాలో మంజు వారియర్ పాత్ర చాలా కీలకమైంది. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అని అందరూ చర్చించుకుంటున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఈ క్యారెక్టర్ సీనియర్ నటి సుహాసిని మణిరత్నం నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇంతక ముందు ఈ పాత్రలో విజయశాంతి నటించబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు సుహాసిని అంటున్నారు. గతంలో చిరంజీవి – సుహాసిని జంట సినీ ప్రేక్షకులను అలరించింది. కాకపోతే ‘లూసిఫర్’ సినిమా ప్రకారం అయితే వీరి కాంబినేషన్ లో పెద్దగా సీన్స్ కూడా ఉండే ఛాన్స్ లేదు. ఇది ఎంత వరకు నిజమో తెలిదు కానీ ఇది జరిగే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంభందించిన అధికారిక ప్రకటనే రాలేదు.. ఇక అప్పుడే ఈ సినిమాలో ఇతర నటులు యాక్ట్ చేస్తున్నారంటూ ర్యూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు.

కాగా ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో మెగాస్టార్ తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులను సూచించాడని సమాచారం. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్ తెలుగులో వర్క్ అవుట్ అవుద్దా అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. మార్పులు చేర్పులతో రాబోతున్న ఈ సినిమా ‘లూసిఫర్’ సోల్ మిస్ అవ్వకుండా బయటకి వస్తుందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ‘లూసిఫర్’ డబ్బింగ్ సినిమాను ఆల్రేడీ చాలా మంది చూసేశారు.. అసలు ఈ రీమేక్ ప్లానే కరెక్ట్ కాదు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీగా రీమేక్ ని నమ్మిన చిరంజీవికి ఈ మలయాళ రీమేక్ ఎలాంటి రిజల్ట్ ని ఇవ్వబోతుందో చూడాలి.
Please Read Disclaimer