సుజీత్ కు మెగా ఛాన్స్ మిస్సయినా మరోటి దక్కింది!

0

సాహో వంటి భారీ చిత్రాన్ని డీల్ చేసిన సుజీత్ కు మంచి పేరు వచ్చింది. ఇక్కడ కమర్షియల్ గా సో సో గా నడిచినా ఉత్తరాదిలో మాత్రం ఈ చిత్రం మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుంది. తక్కువ అనుభవంతో సాహో వంటి బిగ్గెస్ట్ బడ్జెట్ కాస్టింగ్ మూవీని డీల్ చేయడం చాలా గొప్ప విషయం అంటూ తన లూసీఫర్ రీమేక్ రైట్స్ ను సుజీత్ చేతిలో చిరంజీవి పెట్టారు. దాదాపు మూడు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్ పై వర్క్ చేసిన సుజీత్ ఇటీవలే చిరుకు స్క్రిప్ట్ వినిపించడం జరిగిందట. స్క్రిప్ట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన చిరంజీవి ఈ రీమేక్ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పగించే నిర్ణయం తీసుకున్నాడట.

మెగా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే ఆలస్యం వెంటనే మరో స్క్రిప్ట్ పై సుజీత్ దృష్టి పెట్టాడట. గతంలో తన వద్ద ఉన్న ఒక కథకు ఇప్పుడు మెరుగులు దిద్దుతున్నాడని ఆ కథను యూవీ క్రియేషన్ వారు నిర్మించేందుకు సిద్దంగా ఉన్నారంటూ తెలుస్తోంది. ఇద్దరు హీరోలు ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందంటున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మళ్లీ సుజీత్ ఒక మీడియం రేంజ్ బడ్జెట్ మూవీకి సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఇద్దరు హీరోలకు కథ నచ్చడంతో యూవీ వారితో ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తోంది.

ఈ కరోనా పరిస్థితులు కుదుట పడ్డ తర్వాత ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాహో వంటి భారీ చిత్రాన్ని డీల్ చేసిన సుజీత్ మల్టీస్టారర్ చిత్రాన్ని ఈజీగానే డీల్ చేస్తాడనే నమ్మకాన్ని వంశీ ప్రమోద్ లు కలిగి ఉన్నారు. అందుకే సుజీత్ తో ఈ ప్రాజెక్ట్ కు రెడీ అయ్యారట. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ కు ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం కాబోతుంది.