సాహో డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటో?

0

ప్రస్తుతం సెట్స్ పై ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో ‘సాహో’ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడం.. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో మల్టి లాంగ్వేజ్ ఫిలింగా తెరకెక్కిస్తుండడంతో సర్వాత్రా ఈ సినిమాపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. మరి ఇంత భారీ సినిమాకు 28 ఏళ్ళ సుజిత్ దర్శకుడు కావడం ఆశ్చర్యం కలిగించకమానదు. దాదాపు నలభై షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన అనుభవం ఉన్నప్పటికీ సుజిత్ ‘సాహో’ కు ముందు దర్శకత్వం వహించిన సినిమా ‘రన్ రాజా రన్’ మాత్రమే.

అయితే ‘సాహో’ లాంటి సినిమాకు దర్శకుడిగా ఇప్పుడు సుజిత్ పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రోమోస్ సినిమాపై ఆసక్తిని పెంచేవిగానే ఉన్నాయి. అయితే సినిమా ఎలా ఉంటుంది.. ప్రేక్షకుల్లో నెలకొన్న భారీ అంచనాలను అందుకోగలుగుతుందా అనేది మాత్రం ఆగష్టు 30 వ తేదీనే మనకు తెలుస్తుంది. ‘రన్ రాజా రన్’ రిలీజ్ అయి ఇప్పటికి దాదాపు ఐదేళ్ళు. ప్రభాస్ కోసం వెయిట్ చేయడం.. తర్వాత ‘సాహో’ తెరకెక్కించేందుకు కూడా ఎక్కువ సమయం తీసుకోవడంతో సుజిత్ ఫస్ట్ సినిమాకు సెకండ్ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో సినిమా అవకాశం లభించడమే గొప్ప కాబట్టి ఇంత సమయం వేచి చూసినా నష్టం లేదు. అయితే ‘సాహో’ తర్వాత సుజిత్ ప్లాన్ ఏంటి.. నెక్స్ట్ ఏం సినిమా చేయబోతున్నాడు?

ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేసిన తర్వాత సహజంగా డైరెక్టర్లు అంతకంటే పెద్ద స్థాయిలో సినిమాలు చేసేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి కూడా ‘RRR’ ను టేకప్ చేసిన సంగతి తెలిసిందే. మరి అలానే సుజిత్ కూడా భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే.. ‘సాహో’ కు యూవీ క్రియేషన్స్ వారు పెట్టుబడి పెట్టినట్టుగా ఎవరైనా ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారా? ‘సాహో’ విషయంలో ఇప్పటికే యూవీవారు కాస్త టెన్షన్లోనే ఉన్నారని అంటున్నారు. మరి సుజిత్ ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తాడో.. తన నెక్స్ట్ స్టెప్ ఏంటో వేచి చూడాలి. అయితే ‘సాహో’ ఫలితాన్ని బట్టే సుజిత్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు.
Please Read Disclaimer