ఆ హీరోపై దృష్టి సారించిన సుజిత్?

0

ప్రభాస్ హీరోగా నటించిన ‘సాహో’ భారీ అంచనాల నడుమ విడుదల కావడం.. అంచనాలు అందుకోలేకపోవడం తెలిసిన విషయాలే. ‘సాహో’ సూపర్ హిట్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇప్పుడు మాత్రం దర్శకుడు సుజిత్ తో పని చేసేందుకు పెద్ద స్టార్లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ‘సాహో’ షూటింగ్ సమయంలో మాత్రం ఒకరిద్దరు పెద్ద స్టార్లు సుజిత్ తో మాటామంతి జరిపారని.. ‘సాహో’ ఫలితం తర్వాత మాత్రం వారు స్పందించడం లేదని అంటున్నారు.

అదొక్కటే కాకుండా పెద్ద స్టార్లు ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటుగా నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా ఫిక్స్ అయ్యాయి. వారెవరూ దాదాపుగా డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేరు. దీంతో సుజిత్ మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడని సమాచారం. సుజిత్ గతంలో శర్వానంద్ కు ‘రన్ రాజా రన్’ తో మంచి హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి కూడా సుజిత్ శర్వానంద్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ శర్వా ఒకే చెప్తే సుజిత్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్టే.

శర్వా ప్రస్తుతం తమిళ హిట్ ’96’ రీమేక్.. ‘శ్రీకారం’ సినిమాల్లో నటిస్తున్నాడు. రెండు సినిమాల షూటింగ్ దాదాపుగా చివరి దశలో ఉంది కాబట్టి శర్వా ప్రస్తుతం నెక్స్ట్ సినిమాలను ఫైనలైజ్ చేసుకుంటున్నాడు. సుజిత్ కథ నచ్చితే మాత్రం కు ఛాన్స్ దక్కినట్టే.

Comments are closed.