సాహోని వాళ్ళు ప్రేమిస్తున్నారట!

0

నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన సాహో ఓపెనింగ్స్ పరంగా రికార్డులను తన ఖాతాలో వేసుకుంది కాని టాక్ అండ్ రిపోర్ట్స్ మాత్రం డివైడ్ గానే కొనసాగుతున్నాయి. కాని దర్శకుడు సుజిత్ మాత్రం కూల్ గా రియాక్ట్ అవుతున్నాడు. రివ్యూలను పట్టించుకోనని వాటికెలా స్పందించాలో కూడా తనకు తెలియదని చెబుతూ ఆడియన్స్ మాత్రం సాహోని స్వంతం చేసుకుని ప్రేమిస్తున్నారని ఇంతకంటే ఇంకేం కావాలని సంతోషం వ్యక్తం చేశాడు.

బాహుబలి తర్వాత వస్తున్న సినిమాగా అంచనాలు విపరీతంగా ఉండటం వల్ల పోలిక సహజమే అయినప్పటికీ తాను సాధారణ కంటితో చూడలేనంత ఎత్తులో ఉన్న రాజమౌళితో తన మూవీని పోల్చడం మాత్రం సరికాదని చెప్పాడు. తనను నమ్మి ఇంత ఖర్చు పెట్టిన నిర్మాతను హీరో ప్రభాస్ ని తల్లిని చిన్నబుచ్చే ప్రయత్నం ఎన్నటికి చేయనని సాహో కోసం ఎంత ఇవ్వాలో అంతా చేశానని చెబుతున్న సుజిత్ మొత్తానికి హ్యాపీగానే కనిపిస్తున్నాడు

సుజిత్ మాటలు ఇలా ఉండగా సాహో వీకెండ్ మాత్రం బాగానే ఉండబోతోంది. హిందితో సహా ఇంకే బాషలోనూ పోటీ లేకపోవడంతో వసూళ్లు అదిరిపోతున్నాయి. ఇందులో అధిక శాతం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ప్రేక్షకులు ముందుగా తీసుకున్నవి. సోమవారం కూడా పండగ సెలవు కావడంతో మొత్తం నాలుగు రోజులు సాహోకు కలిసి వస్తోంది. ఆపై మంగళవారం సాహోకు అసలు పరీక్ష మొదలవుతుంది. సుజిత్ చెప్పడం సంగతి పక్కనపెడితే బాక్స్ ఆఫీస్ వద్ద సాహో రన్ గురించిన ప్రిడిక్షన్స్ కొంత ఆందోళన రేగేలాగే ఉన్నాయి. ఒక నాలుగైదు రోజులు అయ్యాక కాని క్లారిటీ వచ్చేలా లేదు. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home