సుక్కు కథతో కుర్ర హీరో సినిమా!

0

ప్రస్తుతం ఓ వైపు దర్శకుడిగా బడా సినిమా చేస్తూనే మరో వైపు ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టాడు సుకుమార్. మరో బ్యానర్ తో టైయప్ అయి సినిమాలు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ‘ఉప్పెన’ నిర్మిస్తున్న సుకుమార్ ఇంకో సినిమాకు శ్రీకారం చుట్టాడు. అవును అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ తో కలిసి నిఖిల్ సినిమాను నిర్మిస్తున్నాడు సుకుమార్.

‘కుమారి 21 ఎఫ్’ ఫేం సూర్య ప్రతాప్ ఏ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సుక్కు కథతో పాటు స్క్రీన్ ప్లే అందిస్తుండటం మరో విశేషం. మరి అర్జున్ సురవరంతో ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న నిఖిల్ సుక్కు కథతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
Please Read Disclaimer