చిత్తూరు ఆర్టిస్టులకు సుకుమార్ ఛాన్స్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ మూవీ ఏఏ 20 ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ లో నడిచే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్తూరు యాస.. నేటివిటీ ప్రధాన హైలైట్ గా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సుక్కు ప్రతీ పాత్రలో రియాల్టీని చూపే ప్రయత్నం చేస్తున్నాడు. దీనిలో భాగంగా ఎంపిక చేసుకునే పాత్రధారుల్ని ప్రత్యేకించి చిత్తూరు.. తిరుపతి నుంచి కావాలని అడిగారట. ప్రస్తుతం చిత్తూరు యాస తెలిసిన నటుల కోసం క్యాస్టింగ్ ఏజెంట్లు సెర్చింగ్ లో ఉన్నారు.

ఈనెల 9- 10 తేదిల్లో మైత్రీ మూవీ మేకర్స్ తిరుపతి లో సెలక్షన్ కి ప్లాన్ చేసింది. కేవలం చిత్తూరు యాస బాగా తెలిసిన నటుల కోసమే ఈ క్యాస్టింగ్ కాల్ అని మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సమాచారం అందింది. నేచురల్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో తీస్తున్న చిత్రమిది. యాస భాష సంస్కృతి ప్రతిదీ పక్కాగా డిజైన్ చేశారట సుకుమార్. చిత్తూరు యాసతో పలు వీడియోలు ఇప్పటికే యూ ట్యూబ్ లో ట్రెండింగులో ఉన్నాయి. వాటి ఆధారంగానూ ఆర్టిస్టుల్ని ఎంపిక చేస్తున్నారట.

చిత్తూరు స్లాంగ్ లో యూనిక్ నెస్ ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ స్లాంగ్ లోనూ శ్రీకాకుళం స్లాంగ్ లో ఉన్నంత ఫన్ ఉంటుంది. అందుకే యాస తెలిసిన ఔత్సాహిక నటీనటులకోసం వెతుకుతున్నారు. ఆర్టిస్టులకు ఇది మంచి అవకాశమే. స్టోరీ అంతా చిత్తూరు నేపథ్యమే కాబట్టి ఎంపికైన పాత్రలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉండే అవకాశం ఉంది. దాదాపు 80 మంది చిత్తూరు మహిళా ఆర్టిస్టులకు ఇందులో అవకాశం కల్పిస్తున్నారట. అంతే పెద్ద సంఖ్యలో మేల్ ఆర్టిస్టుల్ని ఎంపిక చేయనున్నారు.
Please Read Disclaimer