డైరెక్టర్లంతా ఇదే.. నిర్మాతకి గుండు సున్నా

0

మునుపటితో పోలిస్తే సినిమా బిజినెస్ మారింది. వ్యాపర శైలి మారింది. ఇంతకుముందులా భారీ పారితోషికాల్ని ముందే చెల్లించాల్సిన పనేలేదు. మన స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లకు ఒకేసారి ప్యాకేజీలు ముట్టజెప్పాల్సిన పనే లేదు. సినిమా షూటింగ్ అయ్యే క్రమంలో బిజినెస్ పూర్తయితే అందులోంచి షేర్ ఇచ్చే ప్రాతిపదికన ఒప్పందాలు సాగుతున్నాయి. అప్పటివరకూ ఖర్చుల కోసం నయానో బయానో ముట్టజెప్పి తమపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నారు నిర్మాతలు. బిజినెస్ ని బట్టి భాగస్వామికి వాటా ఇస్తూ.. రిలీజ్ తర్వాత లాభాలొస్తే అందులోంచి వాటాలు ఇస్తున్నారు. దీనివల్ల ముందే అప్పులు చేసి తీవ్రంగా నష్టపోకుండా కొంతవరకూ వడ్డీల భారం తగ్గించుకోగలుగుతున్నారు. ఇది ఆహ్వానించదగిన ఒప్పంద విధానం అన్న చర్చా ట్రేడ్ లో సాగుతోంది. బడ్జెట్ లో సగభాగం హీరో-దర్శకుడికే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇదే ఆచరణీయం అనుసరణీయం సేఫ్ సైడ్! అంటూ ఎవరికి వారు విశ్లేషిస్తున్నారు.

ఒకప్పుడు దర్శకుల్లో రాజమౌళి- కొరటాల- త్రివిక్రమ్ ఇలా ఏవో కొన్ని పేర్లే ఈ విధానంలో వినిపించేవి. ఇప్పుడు చాలామంది పెద్ద దర్శకుల పేర్లు ఈ జాబితాలో చేరాయి. ప్రతి ఒక్కరూ లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. కొందరైతే కొన్ని ఏరియాల పంపిణీ హక్కులు కోరుకుంటున్నారు. నెలవారీ మినిమం పారితోషికం అందుకుంటూ పని చేస్తున్నారు కొందరు. తాజాగా ఈ తరహాలోనే అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ మూవీ ఏఏ20 కి ఒప్పందం జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏఏ 20 లో నటిస్తున్నందుకు అల్లు అర్జున్ కి .. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కి మైత్రి వాళ్లు ఎంత చెల్లిస్తున్నారు? అంటే ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ లాభాల్లో వాటా అడిగాడట. మైత్రి సంస్థ దీనికి అంగీకరించిందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి ముందే ఆ మొత్తాన్ని సుక్కూ అందుకుంటాడు. అయితే అది దశలవారీగా సాగే ప్రాసెస్. ప్రస్తుతానికి సినిమా పూర్తయ్యేవరకూ సుకుమార్ కి నెలనెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తారట. మొత్తం పారితోషికం మాత్రం ముందే ఇవ్వరు. ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తయితే పంపిణీదారుల నుంచి అందే మొత్తం నుంచి వాటాలు షేర్ చేస్తారు. సినిమా బాగా ఆడి ఓవర్ ఫ్లోస్ వస్తే ఆ లాభాల్లోంచి షేర్ దక్కుతుందట. కథానాయకుడిగా నటిస్తున్న బన్నికి సుకుమార్ కి భారీ ప్యాకేజ్ లు ఉంటాయి కాబట్టి ఈ ప్రాతిపదికన మైత్రి సంస్థ ఒప్పందాలు చేసుకుందన్న మాటా వినిపిస్తోంది. అయితే ఈ విధానంలో సినిమా సంచలన విజయం సాధించినా నిర్మాతకు దక్కే మార్జిన్ అంతే తక్కువగా ఉంటుంది. లాభాలు వచ్చే కొద్దీ భాగస్వాములకు వాటాల్ని షేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మేరకు నిర్మాతకు దక్కే పర్సంటేజీ బాగా తగ్గిపోతుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home