పుష్ప లీక్ పై సుకుమార్ సీరియస్

0

అల్లు అర్జున్.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. బారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గోదావరి పరిసర ప్రాంత అడవిలో జరుగుతుంది. అందుకు సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో బన్నీ లుక్ పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాస్త మాస్ గా రఫ్ లుక్ లో బన్నీ కనిపించబోతున్నాడు అంటూ ఫస్ట్ లుక్ తో క్లారిటీ వచ్చేసింది. షూటింగ్ స్పాట్ నుండి తాజాగా లీక్ అయిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఫస్ట్ లుక్ లో చూపించిన దానికంటే మరీ మాస్ గా కనిపిస్తున్నాడు. ఆ కాస్ట్యూమ్స్ మరియు మేకప్ మరీ రఫ్ లుక్ లో బన్నీని చూపించడంతో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. స్టైలిష్ స్టార్ ను మరీ ఇలాంటి లుక్ లో చూడలేస్తామా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెట్స్ నుండి ఫొటోలు లీక్ అవ్వడంపై దర్శకుడు సుకుమార్ అసహనం వ్యక్తం చేశాడు. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రతి ఒక్కరిని హెచ్చరించాడట. బన్నీ లుక్ లీక్ అవ్వడం సినిమా టాక్ ప్రభావితం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దాంతో సుకుమార్ లీక్ పై సీరియస్ అయ్యాడనే టాక్ వినిపిస్తుంది.