ప్రేమకథలతో సుకుమర్ OTT ఆంథాలజీ

0

కథలు అందించడం శిష్యుల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించడం అన్నది సుకుమార్ కి ఉన్న అలవాటు. సుక్కూ రైటింగ్స్ ప్రొడక్షన్ లో ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు. ఇకపై ఓటీటీ వేదికపైనా సుక్కూ రైటింగ్స్ హవా సాగనుందని ఇటీవల ప్రచారం మొదలైంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా కోసం సుకుమార్ ప్రీ-ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగానే సుకుమార్ ప్రముఖ OTT ప్లాట్ ఫామ్ కోసం లవ్ ఆంథాలజీ ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో సుకుమార్ స్వయంగా రాసిన 9 విభిన్న చిన్న ప్రేమ కథలు ఉన్నాయని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. సుకుమార్ తన మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లలో ఒకరైన పల్నాటి సూర్య ప్రతాప్ (కుమారి 21 ఎఫ్) .. బుచి బాబు సన (ఉప్పెన ఫేం) లకు అవకాశాలిచ్చారు. ఆ ఇద్దరూ చెరో ప్రేమకథకు దర్శకత్వం వహిస్తారు. మిగిలిన ఏడు ప్రేమకథల్ని ఎవరు డైరెక్ట్ చేస్తారు? అన్నది ఫైనల్ కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటికి రానున్నాయి. ఓవైపు పెద్ద తెర.. మరోవైపు ఓటీటీ రెండు వేదికలపైనా సుక్కూ భారీ ప్లానింగ్ తో ముందుకు సాగనున్నారు.