సుక్కు ఈసారి వదల్లేదేం!

0

టాలీవుడ్ డైరెక్టర్స్ లో ఒక్కొక్కరిది ఒక్కో విజన్. అందులో సుకుమార్ ముందు వరుసలో ఉంటాడు. ప్రతి సినిమాకు ఓ ఐడియలజీ ఫాలో అవుతుంటాడు సుకుమార్. కథ -కథనం తో పాటు అతను రాసే సన్నివేశాలు కూడా వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ తో సుకుమార్ చేస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

అదీ రంగస్థలం తర్వాత కావడంతో సుకుమార్ ఈసారి ఎలాంటి కథతో సినిమా చేస్తాడు అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు ఎర్ర చందనం బ్యాగ్ డ్రాప్ ను తీసుకుంటున్నారని అల్లు అర్జున్ ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనే లీక్స్ బయటికి వచ్చేసాయి. ఇదంతా పక్కన పెడితే రంగస్థలం సినిమా ప్రారంభం రోజే తన కథ ఇలా ఉంటుందని చరణ్ ఇలా కనిపిస్తాడని స్కెచ్ తో ఓ పోస్టర్ వదిలాడు సుక్కు.

తాజాగా బన్నీ సినిమా లాంచ్ రోజు కూడా ఇలాంటి క్లారిటీ తో ఓ పోస్టర్ వాడులుతాడేమోనని అందరూ ఊహించారు. అయితే అలా ఊహించినట్టు వదిలిస్తే సుకుమార్ ఎలా అవుతాడు. అందుకే ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఏమి మాట్లాడకుండా పూజా కార్యక్రమాలను ముగించేసారు. మరి తన సినిమా మీద సుకుమార్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో చూడాలి.
Please Read Disclaimer