ప్రతీకారం పై సుకుమార్ మమకారం!

0

తెలుగు దర్శకుల్లో సుకుమార్ కు క్రియేటివ్ ఫిలిం మేకర్ అనే పేరుంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సుకుమార్ కు అభిమానులు ఉన్నారు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే ఈమధ్య సుకుమార్ టేకప్ చేసిన సినిమాలన్నీ ప్రతీకారం కథాంశంతో తెరకెక్కినవే. సుకుమార్ తదుపరి చిత్రం కూడా అదే థీమ్ తో తెరకెక్కనుండడం గమనార్హం.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కనున్న #AA20 ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. నేపథ్యం ఇదే అయినప్పటికీ స్టోరీ మాత్రం ప్రతీకారం ప్రధానంగా సాగుతుందట. సుకుమార్ గత చిత్రాలు ‘1 నేనొక్కడినే’.. ‘నాన్నకు ప్రేమతో’.. ‘రంగస్థలం’ చిత్రాల్లో రివెంజ్ థీమ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. సుక్కు మరోసారి అదే థీమ్ ను బన్నీ సినిమాకు కూడా వాడుతున్నాడు. బన్నీ సినిమాలో ఊరమాసు గెటప్ లో కనిపిస్తాడని అంటున్నారు. ‘రంగస్థలం’ లో చరణ్ తరహాలో ఫుల్ రఫ్ గా ఉంటాడట. ఇక హీరోయిన్ రష్మిక కూడా ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా సహజంగా కనిపిస్తుందట.

ఈ సినిమాకు సుక్కు ఆస్థాన విద్వాంసుడు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ లో #AA20 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘రంగస్థలం’ తో చరణ్ కు భారీ హిట్ అందించిన సుకుమార్ ఈసారి #AA20 తో అల్లు అర్జున్ కు భారీ హిట్ అందిస్తాడేమో వేచి చూడాలి.
Please Read Disclaimer