జేమ్స్ బాండ్ భామ

0

తెలుగు లో దాదాపు అరడజను సినిమాలు చేసిన భామ సాక్షి చౌదరి. మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డెహ్రాడూన్ భామ ఆ తర్వాత అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్’ లాంటి సినిమాల్లో నటించింది. ‘జేమ్స్ బాండ్’ లాంటి సినిమాలు పర్వాలేదని అనిపించుకున్నా సాక్షికి కెరీర్ లో పెద్దగా బ్రేక్ రాలేదు. అయితే ఇప్పటికీ చేతిలో ఆఫర్లు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈ భామ సోషల్ మీడియాను ఎలా షేక్ చెయ్యాలో తెలిసిన బ్యూటీ.

అందుకే రెగ్యులర్ గా ఏదో ఒక హాటు ఫోటో పోస్ట్ చేస్తూ నెటిజన్లను కవ్విస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక కత్తి లాంటి ఫోటో ను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి “అన్ ఫిల్టర్డ్.. అన్ ఎడిటెడ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అర్థం అయిందిగా.. సోషల్ మీడియాల లో సగం ఫోటోలు ఒరిజినల్ కావు. ఫోటోలకు టన్నుల కొద్ది మేకప్ ఉంటుంది. ఈ లైన్ మరోసారి చదవండి.. “ఫోటోలకు ఫిల్టర్ లతో.. ఎడిటింగ్ తో డిజిటల్ మేకప్ వేస్తారు”. అలా లేకుండా తన ఫోటో సహజమైనది అంటోంది ఈ భామ. ఇక ఫోటోలో ఒక క్రీమ్ కలర్ శాటిన్ గౌన్ ధరించి వైట్ కలర్ బెడ్డుపై కూర్చుంది. థై స్లిట్ ఉండడంతో కాళ్ళ అందాలు.. స్లీవ్ లెస్ వీ నెక్ కావడంతో ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరీ హరీ అన్నట్టు గా మిగతా అందాలు విందు చేస్తున్నాయి. ఇవి చాలదు అన్నట్టుగా ఈ భామ డ్రెస్ స్ట్రాప్ ను తొలగిస్తున్నట్టుగా/వేసుకుంటున్నట్టుగా ఒక సెక్సీ పోజిచ్చింది. మేకప్ పర్ఫెక్ట్ గా ఉంది. బ్లీచ్ చేసిన హెయిర్ కావడంతో స్టైలిష్ మోడల్ తరహా లో కనిపిస్తోంది.

ఈ ఫోటో కు రెస్పాన్స్ కెవ్వు కేక. “నీకు ఫిల్టర్లు అవసరం లేదు.. నువ్వు న్యాచురల్ బ్యూటీ”.. “ఏంజెల్ లాగా ఉన్నావు”.. “మాయ చేస్తున్నావు” అంటూ కొందరు నెటిజన్లు తమ స్పందనలు తెలిపారు. ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళం లో ‘ఇరుట్టు’ అనే సినిమా లో నటిస్తోంది.
Please Read Disclaimer