సుమ డబ్బా పంచ్ ఎవరికబ్బా..!

0

సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ వేడుక సరిరాదు ఈ వేడుకకు మరో వేడుక అన్నట్లుగా సాగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అవ్వడంతో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ వేడుకలో పాల్గొనడంతో ప్రీ రిలీజ్ వేడుక కాస్త చాలా కలర్ ఫుల్ గా సాగింది. ఈ చిత్రంలో నటించిన రష్మికతో పాటు ఐటెం సాంగ్ చేసిన తమన్నా కూడా ఈ వేడుకలో మెరిశారు. ఇక ఇలాంటి పెద్ద వేడుకలకు సుమ వ్యాఖ్యతగా వ్యవహరించడం చాలా కామన్ గా చూస్తూనే ఉంటాం. సుమ చాలా పొదుపుగా జాగ్రత్తగా మాట్లాడుతుంది. కాని నిన్నటి వేడుకలో సుమ చేసిన ఒక వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు తెర లేపుతోంది.

రష్మిక స్టేజ్ పైకి వెళ్లి మాట్లాడుతూ చిరంజీవి గారు తన ఛలో మరియు గీత గోవిందం చిత్రాల వేడుకలకు హాజరు అయ్యారు అంటూ గుర్తు చేసుకుంది. అదే సమయంలో సుమ మైక్ అందుకుని ఆ రెండు సినిమాల వేడుకలకు నేనే హోస్టింగ్ చేశాను ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి.. నీ సక్సెస్ క్రెడిట్ లో నాకు భాగస్వామ్యం ఉంది అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఎవరి డబ్బా వారు కొట్టుకోవాలి అంటూ మాట అనేసి మైక్ రష్మికకు అప్పగించింది.

సుమ ఎలాంటి ఉద్దేశ్యంతో ఎవరి డబ్బా వారు కొట్టుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేసిందో కాని సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ విషయమై చాలా పెద్ద చర్చ జరుగుతుంది. హీరో గురించి డబ్బా కొడుతున్నారు అంటూ అని ఉంటుందా లేదంటే హీరోయిన్ గురించి డబ్బా కొట్టుకుంటుంది కనుక అలాంటి వ్యాఖ్యలు చేసింది. లేదంటే సినిమా గురించి మరీ ఎక్కువ డబ్బా కొడుతున్నారు అనే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేసిందా అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు సుమ వ్యాఖ్యలను ఖునీ చేసి మరీ పోస్ట్ మార్టం చేస్తున్నారు. మరి ఈ డబ్బా పంచ్ సోషల్ మీడియా కాంట్రవర్శీ పై సుమ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Please Read Disclaimer