చెక్ బౌన్స్ కేసులో అమీషాకి చుక్కలే!

0

బద్రి చిత్రంతో తెలుగు వారికి పరిచయమైంది బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీషా పటేల్. హృతిక్ సరసన కహోనా ప్యార్ హై లాంటి క్రేజీ చిత్రంతో పరిచయమైన ఈ హాట్ గాళ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్- పూరి బృందాన్ని విపరీతంగా ఆకర్షించింది. పూరి ఆశించిన క్వాలిటీస్ అమీషాలో కనిపించాయి కాబట్టే అవకాశం అందుకుంది. బద్రి సక్సెస్ తర్వాత అమీషా కెరీర్ ఇక్కడ బాగానే వెలిగింది.

మహేష్ సరసన నాని.. జూనియర్ ఎన్.టీ.ఆర్ సరసన నరసింహుడు.. బాలకృష్ణ సరసన పరవవీరచక్ర చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవీ సరైన బ్రేక్ ని ఇవ్వలేదు. అటుపై మళ్లీ బాలీవుడ్ కే బౌన్స్ బ్యాక్ అయ్యింది. ఇంతకుముందు ఈ భామ ఓ ప్రోడక్షన్ హౌస్ నుండి 10 లక్షలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలో ఫెయిలైంది. ఈ భామ బ్యాంక్ అకౌంట్లో సరిపడ డబ్బులు లేక చెక్ బౌన్స్ అయిన కేసులో బుక్కయ్యింది.

బ్యాంక్ ఖాతాలో సొమ్ము లేకుండానే 10 లక్షలకు చెక్కు ఇచ్చిందని.. అప్పు ఇచ్చిన నిషా చిప్పా అనే పర్సన్ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారించిన మధ్యప్రదేశ్ కోర్టు అమీషాకు నోటిసులు జారీ చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది జనవరి 27లోగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. అమీషా కెరీర్ ప్రస్తుతం జీరో అయ్యింది. అడపాదడపా ఏవో అవకాశాలొస్తున్నా మునుపటి క్రేజ్ లేదు. కెరీర్ పరంగానే కాదు ఆర్థికంగానూ అమ్మడు నానా తంటాలు పడుతోందిట.
Please Read Disclaimer