చేసినవి 20..14 సినిమాలకు రెమ్యూనరేషన్ లేదట!

0

అన్నీ పైకి కనిపించినట్టుగా ఉండవు. స్టార్ కిడ్స్ అనగానే వారికి ఏం ఇబ్బందులు ఉండవని చాలామంది అనుకుంటూ ఉంటారు. కష్టపడకుండానే అవకాశాలు వస్తాయని.. ఎన్ని ఫ్లాపులైనా మరో అవకాశం ఉంటుందని.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా వారికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం ఉంది. కానీ ఛోటా కె నాయుడు మేనల్లుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే ఇరవై సినిమాలకు పైగా చేశాడు. తన ఖాతాలో కొన్ని హిట్స్ ఉన్నాయి. తమిళంలో కూడా సినిమాల్లో నటించి గుర్తింపు సాధించాడు. అయితే రీసెంట్ గా తన రెమ్యూనరేషన్ గురించి ఒక సంచలన విషయం వెల్లడించాడు.

సందీప్ కిషన్ తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఇప్పటివరకూ 14 సినిమాలు ఫ్రీగా చేసి ఉంటానని షాకింగ్ విషయం తెలిపాడు. అదేమీ త్యాగం చేశాననే ఉద్దేశంతో చెప్పడం లేదని.. కథ నచ్చే ఆ సినిమాల్లో నటించానని చెప్పాడు. అయితే సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ ఇస్తామని కొందరు నిర్మాతలు చెప్పారట. కానీ వాటిలో సగానికి పైగా సినిమాలు ఫ్లాప్ కావడంతో రెమ్యూనరేన్ అందలేదట.. మిగతా సినిమాల నిర్మాతలేమో ఎగ్గొట్టారట. సందీప్ చేసిందే 20 సినిమాలు.. వాటిలో 14 సినిమాలకు రెమ్యూనరేషన్ లేదంటే ఇక అంతకంటే షాకింగ్ అంశం ఏముంటుంది చెప్పండి?

ఏ నటుడైనా తనను గుర్తించాలని కోరుకుంటాడని.. తను కూడా అంతేనని చెప్పాడు. నటుడిగా ఆ గుర్తింపును దక్కించుకున్నట్టుగా చెప్పాడు. ‘నిను వీడని నీడను నేనే’ సినిమాకు సందీప్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. అసలు ఎందుకు నిర్మాతగా మారావని అడిగితే తన ఫ్లాప్ సినిమాలతో చాలా లెసన్స్ నేర్చుకున్నానని అన్నాడు. సినిమా షూటింగ్ సమయంలోనే తనకు ఈ సినిమా ఆడదు అనే విషయం తెలిసిపోయేదని.. సినిమా రిలీజ్ తర్వాత ప్రేక్షకులు.. క్రిటిక్స్ అవే లోపాలు చెప్పేవారని అన్నాడు. అవన్నీ చూసిన తర్వాత తనే కనుక నిర్మాత అయితే అలాంటి లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనతో నిర్మాతగా మారినట్టు చెప్పాడు.
Please Read Disclaimer