ఫేక్ అకౌంట్స్ గురించి సందీప్ కిషన్

0

ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల గోల ఎక్కువైపోయింది. సెలెబ్రిటీలకు ఐడి లేదని తెలియడం ఆలస్యం వాళ్ళ పేరు మీద ఎవరో ఒకరు క్రియేట్ చేయడం వాటి వ్యవహారాలు సదరు హీరో హీరోయిన్లకు తలనెప్పిగా మారడం ఎక్కువైపోయింది. ఇటీవలే నాగార్జున స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఇన్స్ టగ్రామ్ అకౌంట్ లేదని ప్రకటించడం తెలిసిందే. తాజాగా సందీప్ కిషన్ కూడా వీటి బారిన పడ్డాడు. ఎవరో ఆగంతుకులు సందీప్ కిషన్ పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి అందులో వేలాది మందిని స్నేహితులుగా జోడించుకోవడం మొదలుపెట్టారు.

అంతేకాదు అమ్మాయిలకు మహిళలకు అసభ్యక మెసేజులు పోస్టులు పంపారు. ఇది తన స్నేహితులు వెంటనే సందీప్ కిషన్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే అలెర్ట్ అయిన ఇతను ఫేక్ నమ్మొద్దు అని ప్రకటించాడు. ఒక్క సందీప్ కిషన్ అనే కాదు ఎందరో ఈ ఫేక్ అకౌంట్స్ బారినపడుతున్నారు. హ్యాక్ చేసి వేధించే వాళ్ళు ఇంకో రకం.

సైబర్ చట్టాలు ఎన్ని ఉన్నా వాటిలో లొసుగులు బలహీనతలు ఆధారంగా చేసుకుని రెచ్చిపోతున్న ఇలాంటి బ్యాచీల ఆట కట్టించడం అంత సులభంగా ఉండేలా లేదు. కాకపోతే మనకు వీలున్నంత సాధ్యమైనంత మేరకు ఇలా అవగాహనా సృష్టించడం తప్ప సెలెబ్రిటీలైనా చేయగలిగింది ఏమి లేదు. నెట్ మీద అవగాహన తక్కువగా ఉండే వాళ్ళు ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాక ఇలాంటి ఫేక్ అకౌంట్ల బారిన బడి మనఃశాంతిని పోగొట్టుకుంటున్నారు
Please Read Disclaimer