విడుదల వేళ..సందీప్ కిషన్ కు ఊహించని షాక్!

0

సినిమా విడుదల వేళ.. సదరు సినిమాకు పని చేసిన అందరికి టెన్షన్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇక.. నిర్మాత.. హీరో ఒకరే అయితే ఆ ఇబ్బంది అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటి కాంబినేషన్ లో నిను వీడని నీడను నేనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు అన్ని తానైన హీరో సందీప్ కిషన్ కు ఊహించని షాక్ తగిలింది.

ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని ఇప్పటికే ఇన్నోవేటివ్ గా చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్ ను పొందగలిగారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో భారీ ఎత్తున పోస్టర్లు అతికించారు. ఇందులో భాగంగా కాస్త ఉత్సాహంతో మెట్రో స్తంభాల మీద కూడా పోస్టర్లను అతికించేశారు. అయితే.. ఈ పోస్టర్లు అశ్లీలంగా ఉన్నాయన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఉప్పల్ కు చెందిన పలువురు పోస్టర్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. హీరో హీరోయిన్లను అసభ్యంగా చూపించేలా ఉన్న పోస్టర్లను తొలగించాలని కోరారు. దీంతో స్పందించిన అధికారులు.. పోస్టర్లను చించిపారేశారు. అధికారుల తీరుపై చిత్ర బృందం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మెట్రో ఫిల్లర్ల మీద ఏర్పాటు చేసిన పోస్టర్లు అన్ని అనుమతి తీసుకున్న తర్వాత ఏర్పాటు చేశారని చెబుతున్నారు. విడుదల వేళ ఊహించని షాక్ ఇంతకు మించి ఏముంటుంది? అయినా.. ఈ సినిమా పోస్టర్లు ఎప్పుడో విడుదలయ్యాయి. ఇప్పుడు అశ్లీలంగా కనిపించటం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Please Read Disclaimer