సినిమాలోని ఆ సర్ ప్రైజ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది!

0

సందీప్ కిషన్ హీరోగా నటించి స్వీయ నిర్మాణంలో నిర్మించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కార్తిక్ రాజు దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్ తో పాటు ఈ చిత్రాన్ని ఆయన స్నేహితులు వెంకటాద్రి టాకీస్ మరియు వి స్టూడియోస్ ఇంకా విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకంపై నిర్మించడం జరిగింది. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బయ్యర్లు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పడంతో పాటు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయని చెప్పారట. ఈ సందర్బంగా యూనిట్ సభ్యులు క్రాకర్స్ కాల్చి సక్సెస్ సంబురాలను నిర్వహించుకున్నారు. ఈ సందర్బంగా సందీప్ కిషన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

మీడియాతో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ముందుగా ప్రేక్షకులకు థ్యాంక్స్. సరిగా నిద్ర పోయి వారం రోజులు అయ్యింది. సినిమాను చాలా నమ్మకంతో తీశాం. సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనన్న టెన్షన్. సినిమా విడుదల నేపథ్యంలో టెన్షన్ భరించలేక ఫోన్ స్విచ్చాఫ్ చేశాను. ఈరోజు ఒంటిగంటకు ఆన్ చేశాను. చాలా మంది ఫోన్ చేశారు. సినిమా బాగుందని చెప్పారు. ఫస్టాప్ చాలా బాగుంది.. లాస్ట్ లో ఎమోషన్ సూపర్బ్ అన్నారు. ఈ సినిమాలో ఫాదర్ మదర్ సెంటిమెంట్ ఉందని ఎమోషన్ సీన్స్ ఉంటాయని మేము ఇన్నాళ్లు చెప్పకుండా సర్ ప్రైజింగ్ గా ఉంచాం. ఆ సర్ ప్రైజింగ్ ఎమోషనల్ సీన్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

మా సినిమాను నమ్మి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రతి చోట నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చినా నేను ఏ విషయాన్ని అంత త్వరగా నమ్మను. అందుకే నాకు తెలిసిన వారిని వారికి తెలిసిన వారి ద్వారా ఎంక్వైరీ చేయమని అడిగాను. వారు సినిమా గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారని చెప్పుకొచ్చాడు. ఈ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకునేందుకు రెండు రోజుల్లో సక్సెస్ టూర్ ను ప్లాన్ చేస్తున్నాను. ప్రేక్షకుల వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పబోతున్నాను అన్నాడు. ఇన్నాళ్లకు ఈరోజు నేను ప్రశాంతంగా నిద్ర పోతానంటూ సందీప్ కిషన్ పేర్కొన్నాడు.
Please Read Disclaimer