వీకెండ్ కలెక్షన్స్ లా కరెంట్ బిల్లులు: హీరో

0

కరోనా లాక్ డౌన్ పుణ్యమానా అందరూ ఇంట్లోనే ఉండి ఫ్యాన్లు కూలర్లు ఏసీ టీవీలు సహా అన్నీ తెగవాడేశారు. ఇంట్లో వాళ్లకి వండిపెట్టడానికి మహిళలు మిక్సర్లను తెగ తిప్పేశారు. అయితే కరోనా భయంతో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసేవారు ఈ పోయిన రెండు నెలలు నమోదు చేయలేదు. దీంతో ఆ రెండు నెలలు కలిపి తాజాగా బిల్లులొచ్చాయి. అవి అందరి గుండెలు గుభేల్ మనిపించేలా ఉన్నాయట..అందరికీ కరెంట్ బిల్లుల మోత మోగడంతో చాలా మంది దీనిపై ప్రభుత్వాలను నిలదీశారు.హీరోయిన్లు తాప్సి కార్తీక అయితే ఇంటి కరెంట్ బిల్స్ షేర్ చేసి ఇదేంటి అని ఎండగట్టారు.ఇలా సామాన్యులకే కాదు.. సెలెబ్రెటీలకు కూడా విద్యుత్ చార్జీలు షాకిచ్చాయి. అందరూ కరెంట్ బిల్లులపై ఫిర్యాదు చేస్తున్నారు.తాజాగా యువ హీరో సందీప్ కిషన్ కూడా ఈ విద్యుత్ బిల్లులపై సెటైర్లు వేశారు.ఆయన ట్వీట్ వైరల్ గా మారింది. ‘ఇంట్లోని కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా గుర్తొస్తుందని.. ఇంత కరెంట్ బిల్ ఏంటని.? కరెంట్ బిల్లుల పోటీ వార్ ఆన్ లైన్లో ప్రారంభిస్తారు కావచ్చు.. ఈ బిల్లులు చూస్తుంటే కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్ రిపోర్టుల్లా అనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశాడు.

రెండు మూడు నెలల బిల్స్ ఎవరూ కట్టకపోయేసరికి అంతా కలిపి యూనిట్ కు ఎక్కువ రేట్ పడడంతో వేలల్లో కరెంట్ బిల్స్ వస్తున్నాయి. దీనిపై అందరూ ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ హీరో కూడా కామెంట్ చేయడం విశేషంగా మారింది.
Please Read Disclaimer