లాక్ డౌన్ లో బ్యాచిలర్స్ అంతా లాకైపోతున్నారు

0

టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ లో బ్యాచిలర్స్ అంతా లాకైపోతున్నారు. ఇప్పటికి నిఖిల్ .. నితిన్.. రానా ఓ ఇంటివాళ్లయిపోయారు. మెగా ప్రిన్సెస్ నిహారిక వివాహం టెకీ చైతన్య జొన్నలగడ్డతో జరగనుంది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి జాబితాలో నాలుగైదు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో ప్రభాస్.. శర్వానంద్.. సందీప్ కిషన్ తదితరుల పేర్లు లిస్ట్ లో టాప్ లో ఉన్నాయి. అయితే వీళ్లలో ఎవరికి ముందు? అంటే..

తాజాగా అదిరిపోయే లీక్ అందింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రేస్ లో ముందడుగు వేస్తున్నాడు. `పెద్ద అడుగు` అంటూ పెద్ద మాట ఏదో చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. ట్విట్టర్ లో `పెద్ద అడుగు` అన్న ఒకే ఒక్క మాటతో ఒక్కసారిగా సస్పెన్స్ పెంచేశాడు. అయితే దీనిని డీకోడ్ చేయడం ఏమంత కష్టమేమీ కాదు. ఎవరికి వారు ఇక సందీప్ పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నాడని.. ఇన్నాళ్ల బ్యాచిలర్ షిప్ వదిలేస్తున్నాడని భావిస్తున్నారు.

“2020 నా జీవితం గురించి చాలా విషయాలను పునపరిశీలన చేసుకునేలా చేసింది. నన్ను సంతోషపరిచే విషయాలపై ఆలోచించుకునే అవకాశం కలిగింది. నా జీవితంలో తదుపరి పెద్ద అడుగు వేయడానికి నాకు ధైర్యాన్ని సమయాన్ని ఇవ్వండి… బహుశా చాలా ఉత్తేజకరమైన ఆ వార్తను చెప్పేందుకు ఆగలేను.. సోమవారం వరకూ ఆగండి“ అంటూ సందీప్ లేటెస్ట్ ట్వీట్ లో వెల్లడించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా.కె నాయుడుకి సందీప్ కిషన్ మేనల్లుడు అన్న సంగతి తెలిసిందే. ప్రస్థానం.. గుండెల్లో గోదారి.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్.. నిను వీడని నీడను నేను లాంటి హిట్ చిత్రాలతో సందీప్ పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత కెరీర్ సంగతి చూస్తే.. సందీప్ నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ విడుదల కానుంది. అలాగే ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2లోనూ నటిస్తున్నాడు.