సునీల్ అనే జత బట్టలు కొన్నాడు

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – హాస్యనటుడు సునీల్ మధ్య స్నేహం గురించి తెలిసిందే. కెరీర్ ఆరంభం పంజాగుట్టలోని ఓ రూమ్ లో అద్దెకు ఉండేవారు. అలా ఇండస్ట్రీలో ఎవరి దారి వారికి దొరికింది. త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ అయితే.. సునీల్ ఏకంగా హీరోనే అయ్యాడు. ఆ ఇద్దరి మధ్యా స్నేహం ఎలాంటిదో సునీల్ అల వైకుంఠపురములో మ్యూజిక్ కాన్సెర్టు వేదికపై చెప్పిన తీరు ఆకట్టుకుంది.

బన్ని యాటిట్యూడ్ ఎంతో గొప్పది అని పొగిడేసిన సునీల్.. తన స్నేహితుడిపైనా ప్రశంసలు కురిపించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు. ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే. తను సునీల్ అనే ఒక జత బట్టలు కొన్నాడు. కొన్నాక బట్టలు వేసుకోవాలి కాబట్టి.. తప్పదు కాబట్టి వాటిని వేసుకుని బయటికి ఎలా వస్తాడో.. అలా సినిమా తీసినప్పుడల్లా నన్ను ఆ సినిమాలో పడేస్తాడు“ అంటూ ఎంతో పోయెటిక్ గా సునీల్ తన స్నేహితుడి మంచి తనాన్ని పొగిడేశాడు.

బన్నీకి ఒక పెద్దింట్లో పుట్టామనే యాటిట్యూడ్ ఉండదు. పరుగు సినిమా సమయంలో హీరో కారవాన్లో ఆర్టిస్టులందరం కూర్చున్నాం. కారవాన్ మాదో.. ఆయనదో మాకు తెలిసేది కాదు. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్లిపోతూ ఉండేవారు. మేం ఎక్కువగా అక్కడే కూర్చునేవాళ్లం అంటూ బన్నీతో తన సాన్నిహిత్యాన్ని సునీల్ భయ్యా గుర్తు చేసుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. సునీల్ హీరోగా త్రివిక్రమ్ సినిమా ఎప్పుడో చెప్పనేలేదు.
Please Read Disclaimer