‘సరిలేరు’ ని ఫాలో అవుతున్నారే

0

ఒక సినిమా ప్రమోషన్స్ లో ఎవరి స్టేటజీలు వారికుంటాయి. ఒక సీజన్ లో పోటీ పడే రెండు సినిమాల గురించి ఇక చెప్పనక్కర్లేదు. ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా ప్రమోషన్ ప్లానింగ్ ఉంటుంది. అయితే సంక్రాంతికి విడుదలవ్వబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ సినిమాలు ఇప్పుడు అదే పోటీలో ఉన్నాయి.

ఇక సరిలేరు సోషల్ మీడియా ప్రమోషన్స్ అల కంటే ముందే ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఓ ఇన్నోవెటీవ్ ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఇక అల పాటల జోశ్ తప్ప ఇంకేం లేదు. ఎందుకో ప్రమోషన్స్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోవడం లేదు బన్నీ టీం.

సరిలేరు కి సంబంధించి షూటింగ్ స్పాట్ లో అజయ్ – వెన్నెల కిషోర్ లతో స్టోరీ డిస్కర్షన్స్ గురించి మాట్లాడించి ఓ వీడియో రిలీజ్ చేసాడు అనిల్ రావిపూడి. సినిమాలో నటులను కెమెరా ముందుకు తెచ్చి ఏదో కొత్తగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు సేం అదే ప్లాన్ ను ఫాలో అవుతూ అల మేకర్స్ ఓ వీడియో వదిలారు. సినిమాలో క్యారెక్టర్స్ చేసిన సునీల్ – హర్షవర్దన్ ని కూర్చోబెట్టి మ్యూజిక్ కన్సర్ట్ గురించి హైప్ పెంచేలా ఏదో సరదా వీడియో షూట్ చేసి రిలీజ్ చేసారు. సో ఈ ఆలోచన ఎవరిదా అనేది పక్కన పెడితే ఈ ఆలోచన అనిల్ ముందే ఇంప్లెమెంట్ చేసి సక్సెస్ అయ్యడు.
Please Read Disclaimer