సునీల్ కు మరో ఛాన్స్

0

హీరోగా వరుస ఫ్లాప్స్ రావడంతో సునీల్ మళ్లీ కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. కాని ఏ ఒక్క సినిమాలో కూడా సునీల్ కు మంచి పాత్ర దక్కలేదు. ఈయన చేసిన పాత్రలతో నవ్వించిన దాఖలాలు లేవు. సునీల్ కమెడియన్ గా మళ్లీ సెటిల్ అవ్వడం కష్టం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సునీల్ పై నమ్మకంతో దర్శకుడు సంపత్ నంది ఛాన్స్ ఇచ్చాడు.

అటు హీరోగా నటించలేక ఇటు కమెడియన్ గా మంచి ఛాన్స్ లు దక్కక దిక్కులు చూస్తున్న సునీల్ కు సిటీ మార్ చిత్రంలో కీలక పాత్రను సంపత్ నంది ఆఫర్ ఇచ్చాడు. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కమెడియన్ గా కూడా ఉంటుందని అంటున్నారు. గౌతమ్ నంద చిత్రంతో పెద్దగా ఆకట్టుకోని సంపత్ నంది ఈసారి కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

గోపీచంద్ మరియు తమన్నా జంటగా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. గోపీచంద్ ఏపీ కబడ్డీ జట్టు కోచ్ గా కనిపించనుండగా తెలంగాణ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించబోతుంది. వీరిద్దరి కాంబో సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని అంటున్నారు. ఇక వీరిద్దరితో పాటు సునీల్ సీన్స్ కూడా సినిమాను మరింత ఎంటర్ టైన్ మెంట్ ను ప్రేక్షకులకు అందిస్తాయనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మరి సునీల్ కు వచ్చిన ఈ ఛాన్స్ అయినా వర్కౌట్ అయ్యేనా చూడాలి.
Please Read Disclaimer